Wednesday, 15 January 2025 08:33:56 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

నిరుద్యోగ యువతకు ఆశల వల వేస్తోన్న కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. గ్రూప్ 1,2,3,4 పరీక్ష తేదీలు ఖరారు..!

Date : 18 November 2023 07:56 AM Views : 289

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో కాంగ్రెస్ తాజాగా మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విడుదల చేసిన ఈ మేనిఫెస్టోను అభయహస్తం పేరుతో విడుదల చేసింది. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదని మేనిఫెస్టోలో పేర్కొంది. తాజా మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ కూడా కాంగ్రెస్‌ ప్రకటించింది. అందులో గ్రూప్ 1, 2, 3, 4 పరీక్ష నిర్వహణ తేదీలను సైతం ప్రకటించింది. గ్రూప్ -1 నోటిఫికేషన్ ఒక్కసారి విడుదల చేస్తామని, గ్రూప్ 2, 3, 4 నోటిఫికేషన్లు మాత్రం రెండు విడతలుగా విడుదల చేస్తామని తెల్పింది. అలాగే గ్రూప్స్‌తో పాటు 13 విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తామని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ క్రమంలో గ్రూప్స్ పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లు విడుదల చేసే తేదీలు, కానిస్టేబుల్ పరీక్షల నోటిఫికేషన్ తేదీలను కూడా ప్రకటించింది. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రకారం.. ఉద్యోగాల నోటిఫికేషన్లు.. అవి వెలువడే తేదీలు ఇలా.. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీన, డిసెంబర్ 15వ తేదీన కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర యూనిఫామ్ జాబ్‌ల నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొంది గ్రూపు-1 ఉద్యోగాల కోసం 2024 ఫిబ్రవరి 1న నోటిఫికేషన్‌ విడుదల గ్రూపు-2 ఉద్యోగాల నోటిఫికేషన్‌ 2024 ఏప్రిల్ 1న విడుదల గ్రూపు-3 నోటిఫికేషన్ జూన్1, డిసెంబరు 1న రెండు విడతలగా విడుదల గ్రూపు-4 నోటిఫికేషన్ జూన్ 1, డిసెంబరు 1న రెండు విడతలుగా విడుదల కాగా తెలంగాణలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు తాయిలాలను ఆశ చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు విడుదల చేసిన కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో నిరుద్యోగ యువత ఓట్లను ఆకర్షించేందుకు ఇలా ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన అంశాలను మేనిఫెస్టోలో ప్రకటించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీఎస్పీయస్సీ ప్రక్షాలన చేయడంతో పాటు వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని హామీలు ఇస్తోంది. మరో వైపు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కూడా ఓట్లను రాబట్టేందుకు బాగానే తాయిలాలు సిద్ధం చేసుకుంటున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :