Saturday, 18 May 2024 01:00:09 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కరీంనగర్‌లో ఈసారి రసవత్తర పోటీనే.. ఎవరూ తగ్గట్లేదుగా..

Date : 15 October 2023 08:14 AM Views : 68

జై భీమ్ టీవీ - తెలంగాణ / : కరీంనగర్ అసెంబ్లీకి ఈసారి ఆసక్తికరమైన పోటీ జరగనుంది. ఇక్కడ నాలుగవసారి గంగుల కమలాకర్ పోటీ చేయనున్నారు. అదే సమయంలో బీజేపీ నుంచి బండి సంజయ్ మూడవ సారి పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ కోసం నలుగురు నేతలు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ టికెట్ ఫైనల్ అవలేదు. బీజేపీ జాబితా విడుదల కాకున్నా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని మనస్సులో మాట చెప్పారు సంజయ్. దీంతో బిఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఇక.. కాంగ్రెస్ వివిధ సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని టికెట్ ఇస్తామని చెబుతోంది. అయితే, గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే.. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోరు ఉంది. ఈసారి మాత్రం తాము గట్టి పోటీ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్‌ పార్టీకి కంచుకోట. వరుసగా మూడు సార్లు విజయం సాధించింది. ఇక్కడ బీఆర్ఎస్ తప్ప వరుసగా ఎవరూ విజయం సాధించిన చరిత్ర లేదు. కానీ, మంత్రి గంగుల మాత్రం.. మూడు సార్లు విజయం సాధించి సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ పోటీ ఉన్నా.. 2014 నుంచి సీన్ మారిపోయింది. ప్రధాన ప్రత్యర్థి బీజేపీగా అవతరించింది. 2018 ఎన్నికల్లో గంగుల కమలాకర్.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై 14 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ఈ ఇద్దరు మరోసారి బరిలోకి దిగుతున్నారు. నాలుగోసారి గెలిచి తన సత్తా ఏంటో చూపుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి గంగుల. అయితే, ఈసారి బిఆర్ఎస్‌కు ఓటమి తప్పదని బండి సంజయ్ చెబుతున్నారు. పూర్తిగా ఇక్కడే మకాం వేసి.. బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తానని అంటున్నారు. ఇలా ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే సంకల్పంతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల రణరంగంలో ముందుకు కదులుతున్నారు. ఇప్పటికీ ఈ ఇద్దరు నేతలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ ఇద్దరు పోటీ చేయడంతో ఇక్కడ… ఆసక్తి పోరు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే.. గంగుల కమలాకర్ బీజేపీకి చెందిన ముఖ్య నేతలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే, పలువురు నేతలు. బీఆర్ఎస్‌లో చేరారు . బీఆర్ఎస్ డబ్బుల రాజకీయం చేస్తుందని… కొనుగోళ్లకు శ్రీకారం చుట్టిందని విమర్శలు గుప్పిస్తున్నారు బండి సంజయ్. ఖచ్చితంగా. బిఆర్ఎస్ ఓడిపోతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు సవాళ్లు . ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. అయితే.. కాంగ్రెస్ మాత్రం సైలెంట్ అయిపోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన పొన్నం ప్రభాకర్… హుస్నాబాద్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఇక్కడ కొత్త వారు కాంగ్రెస్, టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా నలుగురు నేతలు. టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కొమిటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త కొత్త జయపాల్ రెడ్డి, ఎంఎస్ఆర్ మనువడు రోహిత్ రావు. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. వివిధ సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని టికెట్ ఇస్తామని… అధిష్టానం చెబుతుంది. అయితే, మొదటి జాబితాలో టికెట్ ప్రకటించే అవకాశం లేదు. దీంతో ఇక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో… వ్యక్తిగతంగా ప్రచారం చేసుకుంటున్నారు. నలుగురు నేతలు. తమ అనుచరులతో ప్రచారం చేసుకుంటున్నారు.. అయితే, బిఆర్ఎస్, బీజేపీ మాత్రం ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటిస్తుంది. అయితే, ఇక్కడ త్రిముఖ పోరులో తమదే పైచేయి ఉంటుందని.. కాంగ్రెస్ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కరీంనగర్‌లో.. ఎన్నికల ఆట మొదలైంది.. మరో రెండు మూడు రోజుల్లో పార్టీలు అగ్రనేతలు.. ప్రచారపర్వంలోకి దిగనున్నారు. కరీంనగర్‌లో చేసిన అభివృద్ధి చూసి, తనకు ఓట్లు వేస్తారవి.. మంత్రి గంగుల కమలాకర్ అంటున్నారు. నాలుగవ పొరి జయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. ప్రతి పక్షాలకు కనీసం డిపాజిట్ కూడా రాదని అంటున్నారు. ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అధిష్టానం ఆదేశిస్తే.. పోటీ చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ చెబుతున్నారు. ఈసారి బిఆర్ఎస్ కు గుణపాఠం దెబుతారని అంటున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :