Saturday, 18 May 2024 01:41:58 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు.. ఏయే తేదీల్లో అందుబాటులో ఉంటాయో ఫుల్‌ లిస్ట్‌ ఇదే

Date : 21 November 2023 09:13 AM Views : 67

జై భీమ్ టీవీ - తెలంగాణ / : శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మార్గంలో 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. నవంబర్‌ 26, డిసెంబరు 3 తేదీల్లో.. సికింద్రాబాద్‌-కొల్లం (స్పెషల్‌ ట్రైన్‌ నెంబర్‌ 07129/07130) సాయంత్రం 4.30 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.55కి కొల్లాం చేరుకుంటుంది. నవంబర్‌ 28, డిసెంబర్‌ 5 తేదీల్లో తిరుగు ప్రయాణం (కొల్లం-సికింద్రాబాద్‌) ఉంటుంది. తెల్లవారుజామున 2.30 గంటలకి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.55కి సికింద్రాబాద్‌ చేరుకోనుంది. నర్సాపూర్‌-కొట్టాయం (స్పెషల్‌ ట్రైన్‌ నెంబర్‌ 07119/07120) నవంబర్‌ 26, డిసెంబరు 3 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4.50 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (కొట్టాయం-నర్సాపూర్‌) నవంబర్‌ 27, డిసెంబర్‌ 4 తేదీల్లో సాయంత్రం 7 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 9కి నర్సాపూర్‌కు చేరుకుంటుంది. కాచిగూడ-కొల్లం (స్పెషల్‌ ట్రైన్‌ నెంబర్‌ 07123/07124) నవంబర్‌ 22, 29, డిసెంబరు 6 తేదీల్లో సాయంత్రం 5.30కి బయల్దేరి మర్నాడు రాత్రి 11.55 గంటలకి కొల్లాంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (కొల్లం-కాచిగూడ) నవంబర్‌ 24, డిసెంబర్‌ 1, 8 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకి కాచిగూడ చేరుకుంటుంది. కాకినాడ-కొట్టాయం (స్పెషల్‌ ట్రైన్‌ నెంబర్‌ 07125/07126) ఈ నెల 23, 30 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకి కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (కొట్టాయం-కాకినాడ) నవంబర్‌ 25, డిసెంబర్‌ 2 తేదీల్లో రాత్రి 12.30 గంటలకి బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌-కొల్లం (స్పెషల్‌ ట్రైన్‌ నెంబర్‌ 07127/07128) నవంబర్‌ 24, డిసెంబరు 1 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకి బయల్దేరి మర్నాడు సాయంత్రం 7.30కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (కొల్లం-సికింద్రాబాద్‌) నవంబర్‌ 25, డిసెంబర్‌ 2 తేదీల్లో రాత్రి 11కి బయల్దేరి రెండవ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్‌లన్నింటికీ ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ ఏసీ బోగీలతో పాటు స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు ఉంటాయని తన ప్రకటనలో తెల్పింది. రైళ్లను నడిపించడంలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌ స్పష్టం చేశారు. విధుల్లో పాల్గొనే లోకో పైలట్లు, అసిస్టెంట్‌ లోకో పైలట్లతో పాటు రైళ్ల కార్యకలాపాల్లో పాలుపంచుకునే సిబ్బందికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :