Saturday, 18 May 2024 01:42:02 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బాబుకు కేసీఆర్ షాక్.. సైకిల్‌పై కన్నేసిన కారు.. భలే స్కెచ్ వేసిన గులాబీ బాస్

Date : 07 November 2023 11:35 AM Views : 82

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రచారంలో దూసుకెళ్తోంది గులాబీదళం. సామాన్య కార్యకర్తల నుంచి సీఎం బిడ్డ వరకు, ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఇతర పార్టీల నేతలను సైతం తమ వైపు ఆకట్టుకుంటున్నారు. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేకుండా అందరినీ గులాబీ దళంలో కలుపుకుంటున్నారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా గులాబీ బాస్.. వ్యుహ ప్రతివ్యుహలకు పదును పెడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కేడర్‌పై గులాబీ పార్టీ కన్నేసింది. ఎన్నికల్లో టీడీపీ పోటీ చేద్దామని నిర్ణయంతో ఆ పార్టీలోని సీనియర్ నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. ఒక సామాజికవర్గంలో వచ్చిన వ్యతిరేకతను కవర్ చేసేందుకు తెలుగుదేశం అస్త్రాన్ని వాడుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలోనే వరుస చేరికలతో తెలుగుదేశం కేడర్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల బరిలో నుంచి టీడీపీ తప్పుకోవడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పదవులకు రాజీనామా చేసి గులాబీ దళంలో చేరిపోయారు. దీంతో మిగిలిన కేడర్‌ను కూడా దగ్గర తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది బీఆర్ఎస్. తెలంగాణ వచ్చిన తర్వాత టీడీపీ మెజార్టీ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో చాలామంది టీడీపీ నుంచి వచ్చిన వారే. అయితే ఆ పార్టీలో మిగిలి ఉన్న సీనియర్లను తమ వైపు తిప్పుకోవడం ద్వారా, ఆ పార్టీ బలాన్ని వాడుకోవచ్చని చూస్తుంది. చంద్రబాబు అరెస్టు తర్వాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పరిణామంతో కమ్మ సామాజిక వర్గ ఓట్లు బీఆర్ఎస్‌ దూరమయ్యాయని చర్చ జరుగుతుంది. ఇతర సామాజిక వర్గ సెక్యులర్లు తమవైపే ఉన్నారని భావిస్తున్న బీఆర్ఎస్, తెలంగాణలో ఉన్న టీడీపీ సింపటైజర్లును మెల్ల మెల్ల తమవైపు వచ్చే స్కెచ్ వేస్తోంది. గతంలో టీడీపీలో పనిచేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలుగుదేశం కేడర్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉండడంతో, ఆ పార్టీలోని సీనియర్లను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎర్ర శేఖర్, కొత్తగూడెం నేత మాజీ మంత్రి కోనేరు సత్యనారాయణ తోపాటు ఇతర నేతలను చేర్చుకోవడం ద్వారా టీడీపీ తమవైపే ఉందన్న సంకేతాలు ఇస్తుంది బీఆర్ఎస్. ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో టీడీపీకి మంచి కేడర్ ఉందన్న విషయం బీఆర్ఎస్ గ్రహించింది. 2014, 2018 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు పోలైన ఓట్లను బట్టి చూస్తేనే తెలుస్తుంది. కమ్మ వాళ్లతో జరిగే నష్టాన్ని టీడీపీ సానుభూతిపరులతో భర్తీ చేసుకునేందుకు గులాబీ బాస్ స్కెచ్ వేసినట్లు కనిపిస్తుంది. టీడీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు రాష్ట్ర జిల్లాల కార్యవర్గంను మూకుమ్మడిగా పార్టీలో చేర్చుకున్నారు. తెలంగాణలో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్న చంద్రబాబుపై వ్యతిరేకతతో ఉన్న కార్యకర్తలు తమకు ప్లస్ అవుతారని బీఆర్ఎస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :