Saturday, 18 May 2024 11:37:55 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నేటి నుంచి కేసీఆర్‌ రెండో విడత ప్రచారం.. నాన్‌స్టాప్‌గా సాగనున్న పర్యటనలు

Date : 26 October 2023 10:25 AM Views : 63

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ దూసుకుపోతున్నారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా గురువారం రెండో విడత సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. ఒక్కో రోజు రెండు, మూడు సభల్లో పాల్గొననున్నారు కేసీఆర్‌. నవంబర్‌ 9వరకు నాన్‌స్టాప్‌ బహిరంగ సభలతో హోరెత్తించబోతున్నారు గులాబీ బాస్‌. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. ముఖ్యంగా.. బీఆర్ఎస్ స్పీడ్‌ పెంచుతోంది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ నేటి నుంచి మళ్లీ ప్రచార హోరెత్తించబోతున్నారు. ఇప్పటికే.. మేనిఫెస్టో ప్రకటన తర్వాత మొదటి విడత ప్రచారం కంప్లీట్‌ చేసిన కేసీఆర్‌.. మూడ్రోజుల్లో ఆరు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. దసరా నేపథ్యంలో 19 నుంచి 24 వరకు ప్రచారానికి గ్యాప్ ఇచ్చారు కేసీఆర్. మధ్యలో సొంత నియోజకవర్గం గజ్వేల్ నేతలతో భేటీ అయ్యారు. ఇప్పుడు మరో విడత ప్రచారానికి సిద్ధమయ్యారు గులాబీబాస్‌. ఇప్పటికే ఒక విడత ప్రచారం కంప్లీట్‌ చేసిన కేసీఆర్‌. గురువారం నుంచి రెండో విడత ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్‌ 9వరకు నాన్‌స్టాప్‌గా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు ముఖ్యమంత్రి. ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు కేసీఆర్‌. ఇక, గురువారం ఒక్కరోజే మూడు సభల్లో పాల్గోబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌. అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటా 40 నిమిషాలకు అచ్చంపేట, 3గంటలకు వనపర్తి, సాయంత్రం నాలుగున్నరకు మునుగోడు సభల్లో పాల్గోనున్నారు. ఇక, శుక్రవారం పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేట సభల్లో పాల్గొంటారు కేసీఆర్‌. సీఎం కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. నవంబర్‌ 9న ఒకేరోజు ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఆనవాయితీ ప్రకారం 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్‌లో మొదటి నామినేషన్‌, మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్‌ దాఖలు చేస్తారు. 4 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మొత్తంగా.. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు గులాబీబాస్‌. రెండో దశ ప్రచారంతో బీఆర్‌ఎస్‌లో మరింత జోష్‌ నింపబోతున్నారు కేసీఆర్‌.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :