Saturday, 18 May 2024 09:42:05 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఐదేసి సీట్లు ఇవ్వండి.. కామ్రేడ్స్‌తో కాంగ్రెస్‌కు తేలని సీట్ల పంచాయితీ..

Date : 19 October 2023 06:50 PM Views : 107

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో కాంగ్రెస్‌ – కామ్రేడ్ల సీట్ల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఐదేసి సీట్లు ఇవ్వాలని సీపీఐ, సీపీఎం ప్రతిపాదనలు పెడితే.. చెరో రెండేసి ఇచ్చేందుకు కాంగ్రెస్​సముఖంగా ఉంది. ఇందులో ఒకటి కోరుకున్న సీటు.. మరొకటి వేరోచోట ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను కామ్రేడ్స్​అంగీకరించడం లేదు. రెండేసి సీట్లు తాము కోరుకున్న చోట ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సీపీఎం, సీపీఐ చెరో ఐదు స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరుతున్నాయి. ఈ పార్టీల మధ్య పొత్తుల అంశం జాతీయ స్థాయిలోనే నడుస్తోంది. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీపీఎం, సీపీఐ నేతలతో చర్చలు జరిపి.. చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు ప్రతిపాదన పెట్టారనే టాక్ వినిపిస్తోంది. సీపీఐ కోరుకున్న ఐదు సీట్లలో మునుగోడు లేదంటే కొత్తగూడెం ఇస్తామని చెప్పగా.. చివరికి కొత్తగూడెంకు సీపీఐ ఓకే చెప్పినట్లు సమాచారం. మరోటి తాము అనుకున్నట్లుగా చెన్నూరు సీటు ఇస్తామని కాంగ్రెస్​చెప్పినట్టు తెలుస్తోంది. సీపీఎం కోరుకున్న ఐదు సీట్లలో మిర్యాలగూడ సీటు ఇస్తామంటోంది కాంగ్రెస్‌. మరో సీటుపై క్లారిటీ ఇవ్వలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమకు తప్పనిసరిగా సీటు ఇవ్వాల్సిందేనని సీపీఎం పట్టుపడుతోంది. ఇప్పటికే సీపీఎం ప్రతిపాదించిన సీట్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, మధిరలో అభ్యర్థుల్ని కాంగ్రెస్​ ప్రకటించగా.. పాలేరులో మాత్రమే అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ సీటు తమకు ఇవ్వాల్సిందేనని సీపీఎం జాతీయస్థాయి నుంచి గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. రెండో సీటు కింద తమకు చెన్నూరు ఇస్తామనడంపై సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సీటులో పోటీ చేయాల్సిందేనని సీపీఐ గట్టిగా పట్టుబడుతోంది. కాంగ్రెస్​ప్రతిపాదించినట్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు సీటుకు ఓకే చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీపీఐ పోటీ చేయకపోతే, పార్టీకి తీవ్ర నష్టమంటోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :