Saturday, 15 February 2025 06:36:40 PM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

e-Challan: మీక్కూడా ఈ-చలాన్ల పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా.? క్లిక్ చేస్తున్నారా.?

Date : 17 October 2023 06:28 PM Views : 206

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ప్రస్తుతం టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ట్రాఫిక్‌ చలాన్లు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించే రోజులు వచ్చేశాయ్‌. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోన్‌కు వెంటనే ఈ చలాన్‌ పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయి. మెసేజ్‌లోని లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే ప్రతీ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఈ చలాన్లను కూడా వదలడం లేదు. నకిలీ ఈ చలాన్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ట్రాపిక్‌ పోలీసుల రూపంలో అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. నకిలీ ఈ చలాన్ల పేరుతో ప్రయాణికులకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. సగం ఫైన్‌ చెల్లిస్తే చాలంటూ యూజర్లను అట్రాక్ట్ చేస్తూ మోసం చేస్తున్నారు. ఈ లింక్‌ను క్లిక్‌ చేసి వెంటనే ఫైన్‌ కడితే, 50 శాతం డిస్కౌంట్‌ అంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఒక్కసారి లింక్‌ను క్లిక్‌ చేయగానే ఫోణ్‌లోని డేటా మొత్తం సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో ఫోన్‌లో యూజర్ ప్రమోయం లేకుండానే కొన్ని రకాల యాప్స్ డౌన్‌లోడ్‌ అవుతున్నాయి. ఎనీ డెస్క్‌ వంటి యాప్స్‌ ద్వారా ఫోన్‌లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. దీంతో వెంటనే నేరగాళ్లు బ్యాంకు ఖౄతా వివరాలను తెలుసుకొని డబ్బంతా కొట్టేస్తున్నారు. అంతేకాకుండా ఫోన్‌లోని ఫొటోలు, వ్యక్తిగత వివరాలను సేకరించి బెదిరింపులకు దిగుతోన్న సంఘటనలు చూస్తున్నారు. ఇంతకీ వాహనదారుల ఫోన్‌ నెంబర్లు సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి ఎలా వెళ్తోందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇంతకీ ఈ డేటా నేరగాళ్ల చేతుల్లోకి ఎలా వెళ్తొంది అంటే. కొన్ని సంస్థల నుంచి సేకరించిన డేటాను సైబర్‌ నేరగాళ్లు ఇలా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరికీ వాహనాలు ఉండడంతో పెద్ద ఎత్తున మెసేజ్‌లు పంపిస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. E Challan ఒకవేళ మీక్కూడా ఇలాంటి మెసేజ్‌ వస్తే, పొరపాటున ఈ లింక్‌ క్లిక్‌ చేయడం వల్ల డబ్బు పొగొంటుంటే వెంటనే 1930 టోల్‌ ఫ్రీ, పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఒకవేళ చలానా పేరుతో ఫోన్‌కు మెసేజ్‌ వస్తే.. ముందుగా ఈ చలాలా వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్‌ చేసకోవాలి. ఒకవేళ అక్కడ కూడా చలాలా ఉన్నట్లు కనిపిస్తే అక్కడే డబ్బులు చెల్లించుకోవచ్చు. కానీ పొరపాటున కూడా మెసేజ్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేసి పే చేసే సరిపోతుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :