Saturday, 27 July 2024 09:59:37 AM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

రాజ్ భవన్ నుంచి ఎలాంటి లేఖ రాలేదు : మంత్రి సబిత

Date : 08 November 2022 04:29 PM Views : 438

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : రాజ్ భవన్ నుంచి తనకు ఎలాంటి లేఖ అందలేదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు గురించి గవర్నర్ లేఖ రాశారని మీడియా, సోషల్ మీడియాలో మాత్రమే చూశానని చెప్పారు. రేపు ఉదయం నిజాం కాలేజీ హాస్టల్ సమస్యపై ఉన్నత విద్యాశాఖాధికారులతో సమావేశం కానున్నట్లు సబిత ప్రకటించారు. అధికారులతో చర్చించిన అనంతరం నిజాం కాలేజీ వ్యవహారంపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై సోమవారం అంసతృప్తి వ్యక్తం చేశారు. మూడేండ్లుగా యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణ యూనివర్సిటీస్‌‌ కామన్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు బిల్లుపై రాజ్‌‌భవన్‌‌కు వచ్చి చర్చించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. సోమవారం ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డికి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి లెటర్ రాశారు. మరోవైపు రాష్ట్ర సర్కారు కొత్తగా తెచ్చిన కామన్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు బిల్లుపై తమిళిసై యూజీసీ అభిప్రాయం కోరారు. ఈ బిల్లు చెల్లుబాటు అవుతుందో లేదో తెలియజేయాలని సూచించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :