Saturday, 18 May 2024 01:11:17 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

గోల్డ్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. తగ్గిన బంగారం ధర. తులం ఎంతంటే..

Date : 24 November 2023 08:20 AM Views : 75

జై భీమ్ టీవీ - తెలంగాణ / : గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా బంగారం ధరల్లో కాస్త స్థిరత్వం కనిపిస్తోంది. గురువారం దేశవ్యాప్తంగా బంగారం స్థిరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం (ఈరోజు) బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర తగ్గింది. అయితే ఇది స్వల్పమేనని చెప్పాలి. తులం బంగారం పై రూ. 50 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. * దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,950గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,120 వద్ద కొనసాగుతోంది. * ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది. * చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,350గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,550గా ఉంది. * కోల్‌కతా విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది. * బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. * హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది. * ఇక విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,970గా ఉంది. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. బంగారం ధర తగ్గితే వెండి ధరలో మాత్రం పెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 200 వరకు పెరుగుదల కనిపించింది. దీంతో ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాలో శుక్రవారం కిలో వెండి ధర రూ. 76,200గా ఉంది. ఇక చెన్నైలో అత్యధికంగా రూ. 79,200 వద్ద కొనసాగుతోంది. అలాగే బెంగళూరులో రూ. 75,000గా ఉంది. ఇక హైదరాబాద్‌, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 79,200 వద్ద కొనసాగుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :