Saturday, 18 May 2024 11:37:56 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

పూలే అంబేద్కర్ ఆశయాల వారసుడు స్వామి అల్వాల్ కెవిపివ్ఎస్ బంధు సొసైటీ రాష్ట్ర నేతలు టీ స్కైలాబ్ బాబు పల్లెల వీరస్వామి

Date : 15 November 2023 09:42 AM Views : 101

జై భీమ్ టీవీ - తెలంగాణ / : కేవలం 50 గజాల స్థలంలో తాను నివాసం ఉంటూ 300 గజాల స్థలాన్ని ప్రజాసేవకు అంకితం ఇచ్చి 21 మంది మహనీయుల విగ్రహాల నెలకొల్పి నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచిన గొప్ప సంఘ సేవకుడు మానవతావాది డాక్టర్ స్వామి అల్వాల్ లేని లోటు బహుజన సమాజానికి పూడ్చలేనిదని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు బంధు సొసైటీ అధ్యక్షులు పల్లెల వీరస్వామి అన్నారు. ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ స్వామి అల్వాల్ సంస్మరణ సభను కెవిపిఎస్ బంధు సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ గా పదవీ విరమణ పొందిన తర్వాత సంత్ గాడ్గే బాబా శతాబ్ది భవన్ స్థాపించి పేద ప్రజల ప్రజా వైద్యుడిగా అనేక వైద్య సేవలు అందించారని చెప్పారు.1970 కాలంలోనే ఆయన ఎంబిబిఎస్ పూర్తి చేసి పలు రాష్ట్రాలలో వైద్య సేవలు అందించారన్నారు అనేక సామాజిక ఉద్యమాలలో ప్రత్యక్ష భాగస్వామిగా పాల్గొన్నారని గుర్తు చేశారు. తుది శ్వాస వరకు మహనీయుల ఆశయాల బాటలో నడిచారని కించిత్తు స్వార్థం లేకుండా నిస్వార్ధంగా ప్రజల కోసం జీవించారని, ఆయన మరణం బహుజన సమాజానికి తీరని లోటని చెప్పారు. ఆయన ఆదర్శ వివాహం చేసుకొని ఆయన ముగ్గురు కుమార్తెలకు సైతం ఆదర్శ వివాహాలు నిర్వహించి అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచాడని చెప్పారు. 21 మంది మహనీయుల విగ్రహాల నెలకొలిపి వారి జయంతులు వర్ధంతిలను క్రమం తప్పకుండా నిర్వహించి నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని చెప్పారు అంబేద్కర్ పూలే మార్క్స్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేటి తరంపై ఉందని ఆయన పలుమార్లు చెప్పేవారన్నారు. ఈ సంస్మరణ సభలో పలు సంఘాల రాష్ట్ర నేతలు ప్రసంగించారు. బందు సేవా మండలి అధ్యక్షులు కేపీ రావు, మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, ప్రొఫెసర్ ఏకు తిరుపతి, ప్రొఫెసర్ నతానియల్ సీనియర్ అంబేద్కర్ వాది సంగీతపు రాజలింగంటి, పిఎస్ కె డైరెక్టర్ బొజ్జ బిక్షమయ్య, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ప్రముఖ అంబేద్కర్ వాది గోసుల విజయ్ కుమార్ జై భీమ్ సంస్థల ఫౌండర్ చైర్మన్ బరిగెల శివ, ఎంఈఎఫ్ జాతీయ అధ్యక్షులు ఎన్ కృష్ణయ్య ఎమ్మార్పీఎస్ నాయకుడు గండి కృష్ణ, కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ బాల పీరు, బి సుబ్బారావు సిఐటియు నాయకులు జి రాములు, అజయ్ బాబు, రమేష్, వంపు లక్ష్మయ్య, నిర్మల, రవీందర్, మాల్యాద్రి నెమిలి శ్రీనివాస్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :