Saturday, 18 May 2024 11:37:54 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణ డీఎస్సీ 2023 వాయిదా వేయాలంటూ వినతులు

Date : 12 October 2023 08:34 AM Views : 77

జై భీమ్ టీవీ - తెలంగాణ / : రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబరు 20 నుంచి 30 వరకు జరగాల్సిన టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) పరీక్షను వాయిదా వేలయాలంటూ డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం కోరింది. ఆన్‌లైన్‌లో జరగనున్న ఈ పరీక్షలను నెల రోజుల పాటు వాయిదా వేయాలని రాష్ట్ర డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి బుధవారం (అక్టోబ‌రు 10) కోరారు. ప్రస్తుతం టీఆర్‌టీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అక్టోబ‌రు 21వ తేదీ వరకు కొనసాగనుండగా. తుది దరఖాస్తు గడువును మరో వారం పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్‌ 16 నుంచి తెలంగాణ ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు తెలంగాణ సార్వత్రిక ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు అక్టోబరు 16 నుంచి 26 వరకు జరగనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె రాము బుధవారం (అక్టోబరు 10) ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ స్టడీసెంటర్‌లో లేదా అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన సూచించారు. పదో తరగతి విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో, ఇంటర్‌ విద్యార్థులకు ధర్మకంచలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన వివరించారు. ఏపీలోనాన్‌ యూనిఫాం సర్వీసులకు ‘వయోపరిమితి’ గడువు పొడిగింపు ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసే నాన్‌-యూనిఫాం సర్వీసెస్‌ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు గడువు తేదీని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 34 సంవత్సరాలుగా ఉన్న వయోపరిమితిని తాజా ఉత్తర్వులతో 42 ఏళ్ల వరకు పెంచుతూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన నిర్ణీత కాలపరిమితి సెప్టెంబరు 30, 2023తో ముగిసింది. దీనిని వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీతోపాటు ఇతర నియామక సంస్థలు చేపట్టే ఉద్యోగ నియామకాలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :