జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : పిల్లలలో ధనుర్వాతం, కంఠసర్పి వ్యాధులు రాకుండా జిల్లాలోని 5వ తరగతి, 10వ తరగతి చదువుతున్న విధ్యార్థులకు (10 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు, 16 సంవత్సరాల వయసున్న వారు) డిటి వ్యాక్సిన్ ను వేసేందుకు ఈ నెల 7వ తేదీ నుండి 19 వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి సాంబశివ రావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణముగా జిల్లా కలెక్టర్ సూచనలతో ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. దీనికి సంబoదించి ప్రోగ్రాం అధికారులతో డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో సమావేశంలో నిర్వహించడం జరిగింది. పాఠశాలల్లో ప్రతి సంవత్సరం ఈ వ్యాక్సిన్ ఇస్తున్నామని, కోవిడ్ కారణముగా అందరికీ ఇవ్వలేక పోయినందుకు 10 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు, 16 సంవత్సరాల వయసున్న వారందరికి (గత 6 నెలల కాలంలో టిడి వ్యాక్సిన్ వేయించుకున్న వారిని మినహయిoచి) వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దీని కొరకై జిల్లా వ్యాప్తంగా 26 ప్రాథమిక మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో మొత్తం 34838 మందికి వ్యాక్సినేషన్ చేయనున్నట్లు సంభoదిత విద్యా శాఖా మరియు జిల్లా సంక్షేమ శాఖ వారి సహకారంతో నిర్వహించనున్నట్లు, ధనుర్వాతము ఏ వయస్సు లోని వారికైనా రావచ్చని దీని ప్రభావం వల్ల మరణాలు సంభవించే అవకాశం కూడా ఉందని, కంఠసర్పి వ్యాధి ఏపిడమిక్ల రూపoలో ప్రభలుతుందని, కౌమార వయస్సులోని వారిలో ఎక్కువగా కనపడుతుందని, ముఖ్యoగా పాఠశాలలను కేంద్రీ కృతం చేసుకొని అన్నీ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో వేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డిఎంహెచ్‌ఓ డాక్టర్ టి మదన్ మోహన్ రావు, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ యాకూబ్ పాషా, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డాక్టర్ సిహెచ్ గీతా లక్ష్మి, డిటిసిఒ డాక్టర్ పిఎస్ మల్లిఖార్జున్, ఎన్‌సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ వాణిశ్రీ, జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, డిప్యూటీ డెమో కె ప్రసాద్, సిహెచ్‌ఓ మాధవ రెడ్డి, ఎస్ఓ ప్రసన్న కుమార్, డిపిఓ శ్రీనివాస్, డిడిఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin