Saturday, 27 July 2024 07:53:55 PM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

నిజాం కాలేజీలో ఉద్రిక్తత, పలువురు విద్యార్థులు అరెస్ట్

Date : 05 November 2022 01:32 PM Views : 474

జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యను పరిష్కరించాలంటూ ప్రిన్సిపాల్ చాంబర్ లో నిరసనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నూతనంగా నిర్మించిన హాస్టల్ ను అండర్ గ్రాడ్యువేట్ గర్ల్స్ కు కేటాయించాలంటూ.. విద్యార్థులు చాంబర్ లో ప్రిన్సిపాల్ ను కలిసి అడిగారు. అయితే.. నూతనంగా నిర్మించిన హాస్టల్ ను పీజీ విద్యార్థులకు కేటాయించాలని తమకు ఆర్డర్స్ ఇచ్చారని ప్రిన్సిపాల్ చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని, తమకు నూతనంగా నిర్మించిన హాస్టల్ ను కేటాయించాలని వేడుకున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన తమకు హాస్టల్ కేటాయించాలని ప్రిన్సిపాల్ ను కోరారు. ఈ క్రమంలోనే ప్రిన్సిపాల్ చాంబర్ లో విద్యార్థులు బైఠాయించి.. నిరసన తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే నిజాం కాలేజీకి వెళ్లారు. ప్రిన్సిపాల్ చాంబర్ లో నిరసనకు దిగిన విద్యార్థులను అడ్డుకుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. తమను అరెస్ట్ చేయడాన్ని కొందరు విద్యార్థులు తప్పుపట్టారు. తాము ఏ తప్పు చేశామని అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగింది. దీంతో కొందరు విద్యార్థులు స్పల్పంగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థులను అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు. మరోవైపు కొందరు పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్న తమను అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొంతమంది విద్యార్థులపై పోలీసులు చేయ్యి చేసుకున్నారని తెలుస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :