Saturday, 18 May 2024 01:41:55 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

అమ్మ బాబోయ్ అవి నోట్ల కట్టలు కాదు.. గుట్టలే.. బంజారాహిల్స్‌లో భారీగా పట్టుబడిన నగదు..

Date : 11 October 2023 11:39 AM Views : 72

జై భీమ్ టీవీ - తెలంగాణ / : Telangana Elections: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌తో తెలంగాణలో భారీగా నగదు, బంగారం పట్టుబడుతుంది. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి.. తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. హైదరాబాద్‌ లో కారులో తరలిస్తున్న 3కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలుతో తెలంగాణలో నోట్ల కట్టలు గుట్టలుగా బయటకు వస్తన్నాయి. పోలీసుల తనిఖీల్లో నోట్ల కట్టల కోట్ల మోత మోగుతోంది. బంజారాహిల్స్‌లో గుట్టు చప్పుడు కాకుండా కారులో తరలిస్తున్న రూ. 3.35 కోట్ల నగదు స్వాధీనం సుకున్నారు పోలీసులు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే హైదరాబాద్‌లోనే మరో చోట 12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మర తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఇదేక్రమంలో నల్గొండ జిల్లా అనుములలో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ. 30 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్నట్టు గుర్తించారు. మిర్యాలగూడలో రూ.3.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో వాహన తనిఖీల్లో 6.55 లక్షల రూపాయలను ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హబీబ్ నగర్‌లో 17 లక్షలు సీజ్‌ చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన మూడు రోజుల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. ఇప్పటి వరకు 15 కిలోల బంగారం, 400 కిలోల వెండి సీజ్‌ చేశారు. ఎన్నికల కోడ్‌ వేళ పాతబస్తీలో అర్థరాత్రి పోలీసులు కార్డన్‌ సర్చ్‌ నిర్వహించారు. పలుచోట్ల బెల్ట్ షాపులను గుర్తించారు. భారీగా మద్యం స్వాదీనం చేసుకున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :