Saturday, 27 July 2024 10:05:04 AM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్

విచారణలో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు

Date : 11 December 2023 10:21 AM Views : 139

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో డిశంబర్ 9 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ క్రమంలో ప్రశాంతంగా సాగుతున్న ఈ పథకంపై కలకలం రేగింది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో డిశంబర్ 9 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ క్రమంలో ప్రశాంతంగా సాగుతున్న ఈ పథకంపై కలకలం రేగింది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ వైపుగా ప్రయాణిస్తున్న మహిళకు టికెట్ జారీ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నిజామాబాద్ జిల్లా బోధన్‌ డిపో పరిధిలో మహిళలకు టికెట్ జారీ చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. ఎండీ ఆదేశాలతో.. సంబంధిత కండక్టర్‌ను డిపో స్పేర్‌ లో ఉంచి పూర్తిస్థాయిలో ఆర్టీసీ అధికారులు విచారణ జరిపారు. నిజామాబాద్‌-బోధన్‌ రూట్‌ పల్లె వెలుగు బస్సులో నిజామాబాద్‌ టౌన్‌ బస్టాండ్‌ వద్ద ఆదివారం ముగ్గురు ఎక్కారు. అందులో ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పురుష ప్రయాణికుడు ముగ్గురికి బోధన్‌ కు టికెట్‌ ఇవ్వమని కండక్టర్‌ ను అడిగారు. రూ.30 చొప్పున ముగ్గురికి రూ.90 టికెట్‌ ను కండక్టర్‌ జారీ చేశారు. నిజామాబాద్ టౌన్ దాటిన తర్వాత పురుష ప్రయాణికుడు కండక్టర్‌ వద్దకు వచ్చి.. మహిళలకు ఉచితం కదా.. టికెట్‌ ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు. ముగ్గురు పురుషులే అనుకుని టికెట్‌ ను జారీ చేశారని, అన్యదా భావించవద్దని కండక్టర్‌ సమాధానం ఇచ్చారు. వెంటనే ఆ టికెట్‌ ను వెనక్కి తీసుకుని పూర్తి డబ్బును తిరిగి ఇవ్వడం జరిగింది. ఈ విచారణలో కండక్టర్‌ ఉద్దేశపూర్వకంగా టికెట్‌ జారీ చేయలేదని తేలింది

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :