Saturday, 18 May 2024 01:00:08 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

హెచ్‌సీఏ కొత్త బాస్‌గా జగన్‌మోహన్‌ రావు.. ఒక్క ఓటు తేడాతో విజయం..

Date : 21 October 2023 08:39 AM Views : 69

జై భీమ్ టీవీ - తెలంగాణ / : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఏఐ) ప్రధాన కార్యదర్శి అర్శినపల్లి జగన్‌మోహన్‌ రావు ఎన్నికయ్యారు. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఆయన కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అయితే ప్రత్యర్థి అమర్నాథ్‌ రీకౌంటింగ్‌ జరపాలని డిమాండ్‌ చేశారు. అయితే రీకౌంటింగ్ లోనూ ఒక్క ఓటు తేడాతో జగన్ మోహన్ రావు గెలుపొందారు. శుక్రవారం (అక్టోబర్ 20) జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్‌ సజావుగా సాగింది. మొత్తం ఓట్ల సంఖ్య 173. పోలైనవి 169. కౌంటింగ్‌ కూడా సాఫీగా సాగింది. గెలుపు సంబరాలు కూడా జోరందుకున్నాయి. కౌన్సెలర్‌గా సునీల్‌ అగర్వాల్‌ గెలవడంతో ఆయన ప్యానెల్‌ సంబరాలు జరుపుకుంది. క్రికెటర్స్‌ VVS లక్ష్మణ్‌, వెంకటపతి రాజు, మిథాలిరాజ్‌,స్రవంతి సహా పలువురు తమ HCA ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐపీఎస్‌ సజ్జనార్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఓటు వేసిన వారిలో ఉన్నారు. మూడు గంటలకు పోలీంగ్‌ పూర్తయింది. నాలుగు గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమైంది. కాగా ప్రెసెడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, కౌన్సిలర్ …ఈ 6 పదవుల కోసం నాలుగు ప్యానెల్స్‌ ఎన్నికల బరిలో దిగాయి. సుప్రీం కోర్టు నియమించిన సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ లావు నాగేశ్వర రావు ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ వీఎన్ సంపత్ ఆధ్వర్యలో HCA ఎన్నికలు నిర్వహించారు. ప్రెసిడెంట్ పదవికి జగన్ మోహన్ రావ్, అమర్నాథ్, అనిల్ కుమార్, పి.ఎల్ . శ్రీనివాస్ బరిలోకి దిగారు. అయితే చివరకు జగన్‌ మోహన్‌ రావే విజయం సాధించారు. జస్టిస్‌ లావునాగేశ్వరరావు కమిటీ ఫిర్యాదు మేరకు హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజార్‌ సహా పలువురిపై ఉప్పల్‌ పీఎస్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. కొనుగోళ్లకు సంబంధించి కోట్లలో గోల్‌మాల్‌ జరిగిందన్న నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హెచ్‌ సీఏ ఎన్నికల ఫలితాలు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :