Saturday, 18 May 2024 10:36:24 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

అదృశ్యమైన చిన్నారి కథ విషాదాంతం

బాలిక మృతిపై అనేక అనుమానాలు

Date : 16 December 2022 02:12 PM Views : 177

జై భీమ్ టీవీ - తెలంగాణ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మేడ్చల్ జిల్లా: జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన పదేళ్ల ఏళ్ల చిన్నారి ఘటన విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక చెరువు వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు మృతదేహన్ని కనుగొన్నారు. ఇందు మృతిపై బాలిక తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంజాయి బ్యాచ్‌ తమ పాపను ఏదైనా చేయకూడనిది చేసి దమ్మాయిగూడ చెరువులో పడేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసు విచారణ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి అకాల మరణంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. నాల్గవ తరగతి చదువుతున్న ఇందు అనే చిన్నారి గురువారం తప్పిపోయింది. డిసెంబర్ 15వ తేదీ ఉదయం పాప తండ్రి దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాల వద్ద బాలికను వదిలిపెట్టి వెళ్లగా.. ఆ తర్వాత నుంచి పాప కన్పించలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశారు. బాలిక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. ఎట్టకేలకు దమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహం లభించింది. వివరాల్లోకి వెళ్తే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కి చెందిన 4వ తరగతి విద్యార్థిని ఇందు గురువారం ఉదయం స్కూల్‌కి వెళ్లిన తర్వాత.. ఆడుకుంటానని బయటకి వెళ్లి అదృశ్యం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాప ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియజేయాలని ప్రసార, సామాజిక మాద్యమాలు ద్వారా ప్రచారం చేశారు. అయినా ఆచూకీ లభించలేదు. చివరికి బాలిక మృతదేహం లభించింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :