Thursday, 05 December 2024 06:39:27 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

హైదరాబాదీలకు అలర్ట్‌.. శని, ఆదివారాల్లో ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Date : 25 November 2023 08:11 AM Views : 243

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. ఈ నెల 28వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో పార్టీలన్నీ తమ శక్తిమేరకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే అగ్ర నేతలంతా సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు చెందిన జాతీయ నాయకులు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం (నేడు) తెలంగాణకు వస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో 25,26 తేదీల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ జి. సుధీర్‌ బాబు తెలిపారు. శనివారం సాయత్రం 5:20 గంటలకు ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న నేపథ్యంలో.. ఇక్కడి వై.జంక్షన్‌, పీఎన్‌టీ ఫ్లైఓవర్‌, బేగంపేట ఫ్లైఓవర్‌ మీదుగా రాజ్‌భవన్‌ చేరుకుంటారు. 26న ఉదయం 10:35 నుంచి 11:05 మధ్య ప్రధాని రాజ్‌భవన్‌ నుంచి ఎంఎంటీఎస్‌, యశోద ఆసుపత్రి, బేగంపేట ఫ్లైఓవర్‌ మీదుగా బేగంపేట విమానాశ్రయానికి వెళతారు. ఆ వేళల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు, నిలిపివేత ఉంటాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. మోదీ షెడ్యూల్‌ విషయానికొస్తే తొలుత మధ్యాహ్నం 1.30 గంటలకు దుండిగల్‌ ఏయిర్‌ పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి కామారెడ్డిలో బహిరంగ సభలో మధ్యాహ్నం 2.15 గంటలకు పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు తుక్కుగుడలో బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు సాయంత్రం 5.20 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రాజ్‌భవన్ వెళ్తారు. అక్కడే బస చేస్తారు. అనంతరం ఆదివారం దుబ్బాక, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్‌ నియోజకవర్గాల్లో పర్యటించి.. బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఈనెల 27 సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్‌షోతో మోదీ తెలంగాణా ఎలక్షన్ టూర్ పూర్తవుతుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :