Saturday, 18 May 2024 01:41:56 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రెండో జాబితాలో చోటు దక్కని కాంగ్రెస్ అసంతృప్త నేతలుసైలెంట్ భవిష్యత్తు కార్యచరణ..

Date : 30 October 2023 08:53 AM Views : 70

జై భీమ్ టీవీ - తెలంగాణ / : కాంగ్రెస్ 55 మందితో మొదటి లిస్టు విడుదలైనప్పుడు నిరసనలతో గాంధీభవన్‌ అట్టుడికి పోయింది. ఓల్డ్ సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి టికెట్స్ ఆశించి భంగపడ్డ మైనారిటీ లీడర్స్ గాంధీభవన్ ముందు నిరసన తెలియజేశారు. ఇక గద్వాల్ టికెట్ ఆశించి బంగపడ్డ స్టూడెంట్ లీడర్ కురువ విజయ్ కుమార్ తన టికెట్టును రేవంత్‌ రెడ్డికి అమ్ముకున్నాడు అంటూ బాహాటంగా నిరసన తెలియజేశారు. ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేసి మనీ లాండరింగ్‌ విషయంపై విచారణ జరపాలని కోరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యల కింద కురువ విజయ్ కుమార్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే సెకండ్ లిస్టులో అసంతృప్త నేతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని నిరసనలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని అందరూ భావించారు. కానీ సెకండ్ లిస్టు విడుదలైన తర్వాత గాంధీభవన్‌కి పెద్దగా నిరసన సెగ తాకలేదు. కానీ రెండో జాబితా తర్వాత అసంతృప్తితో ఉన్న నేతలు తమ తమ భవిష్యత్తుకు సంబంధించిన వ్యూహ రచన సైలెంట్‌గా చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ధీమాగా ఉన్నారు. కానీ సెకండ్ లిస్ట్ విడుదలైన తర్వాత అతని పేరు లేకుండా మహమ్మద్ అజారుద్దీన్‌కి టికెట్ కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత 55 ఏళ్లుగా తన కుటుంబం కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసిందని ఒకప్పుడు హైదరాబాదులో కాంగ్రెస్ అంటే పీజేఆర్‌గా గుర్తింపు ఉందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అయితే ఈ టికెట్ పై మొదటి నుంచి అజారుద్దీన్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య పోటీ నడుస్తూ ఉండగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి మరకలు అజారుద్దీన్‌కి అంటుకొని నాన్ వెలబుల్ అరెస్టు వారెంట్ జారీ అవ్వడంతో ఇక తనకు టికెట్ సుగుమమని విష్ణువర్ధన్ భావించారు. కానీ అజారుద్దీన్ స్క్రీనింగ్ కమిటీ మెంబర్‌గా ఉండటం వల్ల ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుని టికెట్ తనకే దక్కేలా చూసుకున్నారు. ఇక విష్ణు చెల్లికి ఖైరతాబాద్ టికెట్ కేటాయించడంతో కుటుంబానికి ఒక్కటే టికెట్ అనే ఫార్ములా పై విష్ణువర్ధన్ రెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్‌లోకి కొత్తగా చేరిన నాయకులకు ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇచ్చి, తన విషయానికి వచ్చేసరికి ఉదయపూర్ డిక్లరేషన్ గుర్తుకు వచ్చిందా అంటూ మాట్లాడారు. ఇక విష్ణువర్ధన్ రెడ్డి తన కార్యకర్తల అభిష్టం మేరకు జూబ్లీహిల్స్‌కి మంచి జరిగేందుకు అవసరమైతే బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతానని కార్యకర్తల సమావేశంలో సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నర్సాపూర్ టికెట్ విషయంలో కూడా గాలి అనిల్ కుమార్ తనకు టికెట్ వస్తుందని ఆశించగా రాజిరెడ్డికి టికెట్ కేటాయించడంతో గాంధీభవన్‌కి చేరుకొని.. అనుచరులు కోవర్ట్ హటావో కాంగ్రెస్ బచావో అంటూ నినాదాలు చేశారు. ఓ సందర్భంగా గాలి అనిల్ కుమార్ అనుచరులు పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. పక్కన ఉన్నవారు అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. ఇక నాగం జనార్దన్ రెడ్డి కూడా నాగర్ కర్నూల్ లో తన టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర మనస్థాపన చెందారు. సునీల్ కనుగోలు సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించామని రేవంత్ తనతో అన్నాడని మరి కొత్తగా వస్తున్న వాళ్లకి టికెట్ ఎలా కేటాయించారని ప్రశ్నించారు. త్వరగా లో నాగం బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరబోతున్నారు. అందుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నాయకులతో చర్చలు జరుగుతున్నాయి. యూత్ కాంగ్రెస్‌కి ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడంతో టికెట్టు ఆశించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి కూడా అసంతృప్తిలో ఉన్నారు. యూత్ కాంగ్రెస్ సభ్యులతో గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించి రాహుల్ గాంధీ యూత్ కాంగ్రెస్‌కి టికెట్లు కేటాయిస్తామని మాటిచ్చారని ఇప్పటికీ అవకాశం ఉందని రాహుల్‌తో అపాయింట్‌మెంట్‌ ఫిక్సయినందున ఢిల్లీ వెళ్లి రాహుల్ తో మాట్లాడుస్తానని సభ్యులకు నచ్చజెప్పారు. జడ్చర్ల లేదంటే నారాయణ పేట్ టిక్కెట్ ఆశించిన ఎర్ర శేఖర్, ఎల్లారెడ్డి టిక్కెట్ ఆశించిన సుభాష్ రెడ్డి, నర్సాపూర్ టిక్కెట్ ఆశించిన గాలి అనీల్ అసంతృప్తిలో ఉన్నారు. ఇక హుజురాబాద్ టిక్కెట్ ఆశించిన బల్మూరి వెంకట్, హుస్నాబాద్ టిక్కెట్ ఆశించిన ప్రవీణ్ రెడ్డి, మహాబూబాబాద్ టిక్కెట్ ఆశించిన బలరాం నాయక్, బెల్లయ్య నాయక్. పాలకుర్తి టికెట్ ఆశించిన తిరుపతిరెడ్డి, అంబర్‌పేట్‌ టిక్కెట్ ఆశించిన నూతి శ్రీకాంత్, మోతె రోహిత్, మహేశ్వరం టిక్కెట్ ఆశించిన పారిజాత నర్సింహారెడ్డి, దేవరకొండ టిక్కెట్ ఆశించిన వడ్త్యా రమేష్ నాయక్, మునుగోలు టికెట్ విషయంలో పాల్వాయి స్రవంతి , కృష్ణారెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. అసంతృప్తి నేతలతో గాంధీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో గాంధీభవన్‌కి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏం జరగకపోయినా ఇంకా గాంధీభవన్‌కి నిరసనల సెగ తగిలే అవకాశాలు ఉన్నాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :