Saturday, 18 May 2024 10:36:15 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సాత్విక్‌ ఆత్మహత్యపై విచారణకు ఆదేశించిన మంత్రి సబిత..

శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు

Date : 01 March 2023 02:11 PM Views : 164

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తాజాగా నార్సింగి శ్రీ చైతన్య క్యాంపస్‌లో సాత్విక్‌ అనే విద్యార్థి క్లాస్‌రూంలోనే ఉరేసుకున్నాడు. యాజమాన్యం తీవ్ర ఒత్తిడి వల్లనే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని విద్యార్థి తల్లిదండ్రులతో పాటు తోటి విద్యార్థులు చెబుతున్నారు. Hyderabad: సాత్విక్‌ ఆత్మహత్యపై విచారణకు ఆదేశించిన మంత్రి సబిత.. శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదుSabitha Indra Reddy శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం, సిబ్బంది వేదింపులు తాళలేక విద్యార్థుల ఆత్మ హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి..చదువు చెప్పాల్సిన సిబ్బందే విద్యార్థుల జీవితాలను ఆర్పేస్తునారు.. చదువు పేరుతో విద్యార్థుల పై చేయి చేసుకోవడం , వారిని టార్గెట్ చేసి కొట్టడం లాంటివి చేయడం తో విద్యార్థులు మానసికంగా కుంగిపోతునారు. దీంతో బంగారు భవిష్యత్‌తో ఉండాల్సిన విద్యార్థులు సిబ్బంది పెట్టే టార్చర్ భరించలేక భయంతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నార్సింగి శ్రీ చైతన్య క్యాంపస్‌లో సాత్విక్‌ అనే విద్యార్థి క్లాస్‌రూంలోనే ఉరేసుకున్నాడు. యాజమాన్యం తీవ్ర ఒత్తిడి వల్లనే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని విద్యార్థి తల్లిదండ్రులతో పాటు తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు, విద్యార్థులు కాలేజీ క్యాంపస్‌ దగ్గర ఆందోళనకు దిగారు. ఈక్రమంలో సాత్విక్ ఆత్మహత్యపై విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరపాలని తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి శ్రీ చైతన్య కాలేజ్ యాజమాణ్యంపై 305 ఐపీసీ కింద కేస్ నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసుల నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆచార్య, రమేష్,తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. మరోవైపు విద్యార్థి ఆత్మహత్యపై శ్రీచైతన్య కాలేజీ యాజామాన్యం స్పందించింది. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించింది. విద్యార్థి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :