Saturday, 18 May 2024 10:36:22 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

చిన్నారులను వెంటాడుతున్న ‘ఆటిజం’ .. ఆస్తులు ఒక్కటే కాదు.. మంచి ఆరోగ్యమూ ఇవ్వాలి..

Date : 16 November 2023 11:44 PM Views : 94

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఆధునిక కాలంలో ఆటిజం కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బుద్ధిమాంద్యం కేసులు ఎక్కువగా చిన్నారుల్లో గుర్తిస్తారు. అయితే, వయస్సుకు తగ్గట్లు పిల్లల్లో రావాల్సిన మానసిక పరమైన ఎదుగుదల రాకుండా ఉండే పరిస్థితినే ఆటిజం అంటారు. ఈ సమస్య పిల్లల్లో బాల్యంలోనే ప్రారంభమయ్యే జీవితకాల నాడీ సంబంధిత రుగ్మతగా (న్యూరోలాజికల్ డిజార్డర్) వైద్యులు పేర్కొంటారు. ఆటిజంను వాడుక భాషలో మందబుద్ది అని కూడా పిలుస్తుంటారు. అయితే, ఆధునిక వైద్య సదుపాయాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇలాంటి కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని ప్రముఖ డాక్టర్ ఎ.ఎం రెడ్డి ఆటిజం సెంటర్.. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రలుకు అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ హిమజ హాజరయ్యారు. నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎ.ఎం రెడ్డి ఆటిజం సెంటర్ వారు పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రలుకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా హిమజ మాట్లాడుతూ.. మారుతున్న కాలంలో ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్లో ఆటిజం సమస్య విపరీతంగా వ్యాప్తిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది పిల్లల ఎదుగుదలకు మానసికంగా చాలా ఇబ్బందికి గురిచేస్తుందన్నారు. తల్లిదండ్రుల ప్రస్తుత జీవనశైలి కూడా పిల్లల్లో ఆటిజం సమస్యకు ఒక ముఖ్య కారణమన్నారు. ఆటజంను అరికట్టడానికి డాక్టర్ ఎ.ఎం రెడ్డి ఆటిజం సెంటర్ వారు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని.. ఈ సదస్సులు ఎంతో చేయూతనిస్తాయని.. డాక్టర్ ఎ.ఎం రెడ్డిని కొనియాడారు. వీడియో చూడండి.. ఈ సందర్భంగా డాక్టర్ ఎ.ఎం రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలకు వ్యాక్సిన్లు, యాంటి బయోటిక్ మందులు వాడటం వలన వారి మెంటల్, ఫిజికల్ హెల్త్ సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తులు ఒక్కటే కాకుండా మంచి ఆరోగ్యం ఇవ్వాలని తెలిపారు. ఆటిజాన్ని అరికట్టి పిల్లల భవిష్యత్తుని ఆనందకరంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటూ స్పష్టంచేశారు. హోమియోపతిలో ఏలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆటిజం ను నిర్మూలించవచ్చని.. మొదట్లోనే గుర్తిస్తే ఈ వ్యాధిని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఆటిజం (బుద్ధిమాంద్యం)తో బాధపడే చిన్నారులు ఎదుర్కొనే సమస్యలను, వారికి అందించాల్సిన చికిత్సల గురించి ఎఎం రెడ్డి వివరించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :