Saturday, 18 May 2024 09:42:15 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఓటర్ల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

Date : 16 April 2023 11:47 AM Views : 117

జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : హన్మకొండ జిల్లా జై భీమ్ ప్రతినిధి : ఓటర్ జాబితా 2022-2023 మధ్య కాలంలో తొలగించిన ఓటర్ల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత ఎన్నికల అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ ఐడిఓసిలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఓటర్ జాబితా 2022-2023 మధ్య కాలంలో తొలగించిన ఓటర్ల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలన పై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణినితో కలిసి, ఈఆర్ఓ, ఏఈఆర్ఓలు, సంభందిత ఎన్నికల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ జాబితా 2022-2023 మధ్య కాలంలో తొలగించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచనల మేరకు తిరిగి మరోసారి క్షేత్రస్థాయిలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, సంభందిత ఎన్నికల అధికారులు పరిశీలించి, ఫోటో సిమిలర్ ఎంట్రీస్, షిఫ్టెడ్, డెత్, డబుల్ ఎంట్రీస్, క్షుణ్ణంగా పరిశీలించి, 15 రోజుల్లోగా పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఎలాంటి చర్యలు లేకుండా తొలగించబడిన ఓటర్ల జాబితాను తిరిగి మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన ఓటర్లను తిరిగి ఫారం -6 ద్వారా దరఖాస్తులను స్వీకరించి, ఓటర్ జాబితాలో నమోదు చేయాలన్నారు. చనిపోయిన ఓటర్లను మరోసారి పరిశీలించి ఫారం -7లో వివరాలు పూర్తిస్థాయిలో రికార్డు చేసి, సమర్పించాలని ఆదేశించారు. బదిలీ ఓటర్లుగా తొలగించిన వారి జాబితాలో ఒకవేళ వారు ఇక్కడే నివాసం ఉన్నట్లయితే, మరోసారి ఫారం -6 ద్వారా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయాలని, ఈ పూర్తి ప్రక్రియను పూర్తి చేయడంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు ప్రత్యేక శ్రద్ధ వహించలన్నారు. జిల్లాలో బూతు స్థాయి అధికారులుగా నియమించిన వారి జాబితాను పరిశీలించి, ప్రభుత్వం నుండి జీతం పొందుతున్న వారిని మాత్రమే నియమించాలని, ఎవరైనా ఇతర ప్రైవేటు వ్యక్తులు ఉన్నట్లయితే వారిని తొలగించి ప్రభుత్వరంగ ఆధీనంలో పనిచేయు వ్యక్తులను మాత్రమే నియమించాలని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వాసు చంద్ర, పరకాల ఆర్టీవో రాము, కలెక్టరేట్ ఎన్నికల సెక్షన్ సూపరిండెంట్ జ్యోతి వరలక్ష్మి, అన్ని మండలాల తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :