Saturday, 18 May 2024 01:00:06 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

పూలను పూజించే బతుకమ్మ సంబరాలతో హోరెత్తిన తెలంగాణ.. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సందడి

Date : 15 October 2023 08:18 AM Views : 68

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ప్రకృతిని ప్రేమించడం, పూజించడమే బతుకమ్మ. పచ్చదనంతో మమేకమై బతకాలని చల్లగా ఆశీర్వదించే పండుగ ఇది. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆటాపాటాతో తెలంగాణలోని పల్లె నుంచి పట్టణం వరకు ఝల్లుమంది. బతుకమ్మ సంబరాలను అంబరం తాకేలా మొదలు పెట్టింది. ప్రకృతితో మమేకమై ఆడి పాడడమే బతుకమ్మ. పూలతో ప్రకృతిని పూజించడమే బతుకమ్మ పండుగ. బతుకమ్మ సంబరాలు వరంగల్‌లో అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఒక్కేసి పువ్వేసి అంటూ బతుకమ్మ ఆడతారు ఆడబిడ్డలు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సందడితో ఓరుగల్లు హోరెత్తిపోయింది. హనుమకొండ లోని వేయిస్తంభాల గుడి, వరంగల్‌లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఓ రేంజ్‌లో జరిగాయి. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని బతుకమ్మ చాటిచెబుతుంది. బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల పండుగ. దసరా ఉత్సవాలతో సమానంగా మహిళలు వైభవంగా నిర్వహించే వేడుక. దేశంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే పండుగ ఇది. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ పండుగ.. దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రకృతిలో సూర్యచంద్రులను కొలిచిన విధంగానే వివిధ రకాల పూలను కొలిచే పండుగ ఇది. తీరొక్క రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను చేసి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ మహిళలు బతుకమ్మ ఆడుతారు. ఆడబిడ్డలను ఇళ్లకు ఆహ్వానించి కుటుంబమంతా సంబరాలు చేసుకుంటారు. Telangana: తండ్రి కష్టం చూడలేని తనయుడి ఆలోచన.. సరికొత్త ఆవిష్కరణతో పేటెంట్ హక్కు పొందిన స్టూడెంట్ లాలాపేట్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.. లాలాపేట్ పోచమ్మ దేవాలయం ప్రాంగణంలో స్థానిక మహిళలు, చిన్నారులు బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అత్యంత సంతోషంగా బతుకమ్మ ఆడుతూ సంతోషంగా వేడుకలు జరుపుకున్నారు. వందలాది మంది మహిళలు చిన్నారులు యువతులు బతుకమ్మలను తయారు చేసుకొని బతుకమ్మ ఆడి బతుకమ్మలను నీళ్లలో నిమజ్జనం చేశారు. బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. కుల, మత, వర్గ, వృత్తి, ప్రాంత సంప్రదాయాలకు అతీతంగా బతుకమ్మ వేడుక నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది తెలంగాణ. ప్రకృతిలో లభించే అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడుతారు. గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :