Wednesday, 21 February 2024 06:24:09 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Date : 19 December 2023 09:11 AM Views : 41

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్యనేతలు ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పీఏసీ చేసిన తీర్మానాన్ని అధిష్ఠానానికి అందించనున్నారు. అలాగే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తదితర అంశాలపైనా కేంద్రంలోని ముఖ్యులను కలిసి వారితో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, మంగళవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్‌ రెడ్డి సాయంత్రానికి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. కాగా కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కోరుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికలు మార్చిలోనే వచ్చే అవకాశం ఉండడంతో.. ఇప్పటి నుంచే ఆ ఎన్నికలపై దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లిగా.. ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని సోనియాగాంధీని కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సోనియాగాంధీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకూ పంపనుంది. టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం సోనియాగాంధీని స్వయంగా కలిసి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరనున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 65 సీట్లతో బొటాబొటి మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. వచ్చే లోక్‌సభ ఎన్నికలను తమకు అనుకూలంగా మలచుకోవాలని యోచిస్తోంది. ఈ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకుంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరత కూడా సాధిస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీంతో అగ్రనేత సోనియాగాంధీని రాష్ట్రం నుంచి బరిలోకి దించితే లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయవచ్చన్న యోచనలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా, రాహుల్‌ సహా అధిష్ఠానం మొత్తాన్ని ప్రచారంలో కాంగ్రెస్‌ కేంద్రీకరించిన విషయం తెలిసిందే. వీరి ప్రచారం పార్టీ విజయానికి దోహదపడటంతో లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా సోనియాగాంధీనే ఇక్కడి నుంచి పోటీకి దించి ప్రజల దృష్టిని మరోమారు ఆకర్షించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :