Saturday, 18 May 2024 10:08:43 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణలో కర్ణాటక కాంగ్రెస్ వార్ రూమ్ టీం.. సునీల్ కనుగోలు వ్యూహం ఫలించేనా..?

Date : 14 November 2023 12:39 PM Views : 76

జై భీమ్ టీవీ - తెలంగాణ / : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అక్కడి వార్‌రూమ్ కీలక పాత్ర పోషించింది. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కాంగ్రెస్ లో కర్ణాటక ఎన్నికల ప్రచారంతో పాటు అభ్యర్థుల ఎంపికలో అతని సర్వేలు కీలకంగా పని చేశాయి. అందుకే ఆయన సేవలను తెలంగాణలో కాంగ్రెస్ వినియోగించుకుంటుంది. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేకంటే ముందు సునీల్ కనుగోలు టీం సమర్థవంతమైన అభ్యర్థులు ఎవరు అనేది ఒక సర్వే నిర్వహించింది. నియోజకవర్గాల వారీగా టాప్ ఫైవ్ మెంబర్స్‌ని సునీల్ కనుగోలు టీం సర్వేల ఆధారంగా ఎంపిక చేసింది. అందులో నుంచి టాప్ త్రీ లిస్టును ఏఐసీసీకి పంపించగా.. ఢిల్లీలో పార్టీ పెద్దలు 119 అభ్యర్థులను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచార వ్యూహాల్లో సునీల్ కనుగోలు టీం తలమునకలై ఉంది. హైదరాబాద్ గాంధీభవన్‌కి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో 350 మంది సభ్యులతో కూడిన వార్ రూమ్ టీమ్ బెంగుళూరు నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. గాంధీ భవన్‌లోని ఇందిరభవన్ వార్ రూంను సునీల్ కనుగోలు టీం సందర్శించింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ప్రచారాన్ని మరింత వేగవంతం చేయడానికి రంగంలోకి దిగింది. మొత్తం 30 గ్రూపులుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసారు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు. ఒక్కో టీంలో 10 మంది సభ్యులు అలా 30 టీంలలో 300 మంది సభ్యులు ఉండనున్నారు. 50 మందిని వార్ రూం‌కి అటాచ్ చేసారు. ప్రతి బృందం ఒక్కో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తుంది. నిర్దిష్ట ప్రాంతాల్లో సరైన వ్యూహంతో పాల్గొంటాయి. స్పీచ్‌లు, కేసీఆర్ వైఫల్యాలపై మరో టీమ్ పని చేస్తుంది. వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వ పథకాల్లోని వైఫల్యాలను ఎండగట్టేందుకు మరో టీంను సిద్దం చేస్తున్నారు. ఈ టీమ్‌లన్నీ సునీల్ కనుగోలు ఆధ్వర్యంలోనే ముందుకు వెళ్లనున్నాయి. పార్టీతోపాటూ అభ్యర్థి వీక్‌గా ఉన్న దగ్గర కూడా ప్రత్యేక కార్యాచరణ ప్లాన్ చేస్తున్నారు. ఇలా సునీల్ కనుగోలు వార్ రూం సెంట్రిక్‌గా తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ చేసినట్టు సమాచారం. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కీలకంగా వ్యవహరించిన సునీల్ రాజకీయ వ్యూహాలు.. తెలంగాణ ఎన్నికల్లో కూడా అప్లై చేసి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టిగా భావిస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :