Saturday, 27 July 2024 12:52:22 PM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావాలి...బీఆర్ఎస్ను ఓడించే సత్తా బీజేపీకే ఉంది

Date : 21 May 2023 01:01 AM Views : 600

జై భీమ్ టీవీ - తెలంగాణ / : బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. తాను పార్టీ మారడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉందని..రాబోయే ఎన్నికల్లో బీజేపీ..బీఆర్ఎస్ ను ఓడిస్తుందని దీమా వ్యక్తం చేశారు. బీజేపీలో తానే కాదు..మరెవరూ కూడా పార్టీని వీడటం లేదని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఆహ్వానం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని..కాబట్టి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరాలని సూచించారు. కాంగ్రెస్ లోని మిగతా నేతలు కూడా బీజేపీలో చేరాలన్నారు. బీజేపీ అంటే సెక్యులర్ పార్టీ అని ..అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి ని కూడా బీజేపీలో చేరాలని కోరామన్నారు. కాంగ్రెస్ కన్ఫ్యూజ్ట్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీయే మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పార్టీ అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గతంలో బలవంతంగా ఏపీ, తెలంగాణలను కలిపిందని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలను బలవంతంగా కలిపిన కాంగ్రెస్ ...ఆ తర్వాత రాజకీయ అవసరాల కోసం మళ్లీ విడదీసిందని విమర్శించారు. కాంగ్రెస్ రాజకీయ అవసరాల కోసం ఏదైనా చేస్తుందని విమర్శించారు. వారికి ఒక పాలసీ, సిద్దాంతం అంటూ ఏది లేదని మండిపడ్డారు. బీజేపీపై మతతత్వ పార్టీ ముద్ర వేస్తున్నారని విమర్శించారు. తమ గుజరాతీ పార్టీ అని అంటున్నారని...ఆర్ఎస్ఎస్ పుట్టిందే తెలంగాణలో అని చెప్పారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడు అరెస్ట్ అనేది తమ చేతిలో లేదన్నారు. రాజకీయ పార్టీ ఎవరిని అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణ వ్యతిరేకులే.. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్నొళ్లంతా తెలంగాణ వ్యతిరేకులే అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్లను దొంగలన్న కేసీఆర్.....ఇప్పుడు అవసరం కోసం వారిని పొగుడుతున్నారని చెప్పారు. బీజేపీ ఎప్పుడూ ఆంధ్రా వారిని విమర్శించలేదన్నారు. బీజేపీకి కర్ణాటకలో గతంలో ఎన్ని ఓట్లు వచ్చాయో.. ఇప్పుడు కూడా అన్నే ఓట్లు వచ్చాయన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :