Saturday, 18 May 2024 01:59:45 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

టీఎస్పీయస్సీ ఏఈ, జేటీవో పోస్టులకు హల్‌టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే..

Date : 13 October 2023 12:24 PM Views : 70

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్రలో వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులన్నింటినీ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్లను తాజాగా కమిషన్‌ విడుదల చేసింది.. హైదరాబాద్‌, అక్టోబర్‌ 12: తెలంగాణ రాష్ట్రలో వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులన్నింటినీ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్లను తాజాగా కమిషన్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 14, 15 తేదీల్లో అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవల్సిందిగా టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక రాత పరీక్షలు అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్‌ విధానంలో పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 20న ఐడీబీఐ అసిస్టెంట్‌ మేనేజర్‌ రాత పరీక్ష.. వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు ఐడీబీఐ బ్యాంకులో దాదాపు 600 అసిస్టెంట్ మేనేజ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి సంబంధించి రాత పరీక్ష హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ లేదా రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలు నమోదు చేసి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవల్సిందిగా ఐబీబీఐ సూచించింది. రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఈ పోస్టుల‌ను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సు ద్వారా భ‌ర్తీ చేయ‌నుంది. ఎంపికైన‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పాటు పీజీడీబీఎఫ్‌ కోర్సులో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కోర్సు పూర్తి చేసుకున్నవారికి జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ) ఉద్యోగం సొంతమవుతుంది. తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌కు ‘బీటెక్‌-బీఈడీ’ అభ్యర్థులు కూడా అర్హులే! ఇటీవల తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. టెట్‌ పరీక్షలో అర్హత సాధించిన వారందరికీ డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ కొలువులు సొంతం చేసుకునేందుకు అర్హత ఉంటుంది. అయితే వీరితోపాటు బీఈడీ పూర్తి చేసిన బీటెక్‌ విద్యార్థులు కూడా ఇకపై డీఎస్సీ ఉపాధ్యాయ కొలువులకూ పోటీపడొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం నడుస్తోన్న డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని.. ఈ మేరకు తెలుపుతూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :