Saturday, 18 May 2024 01:59:56 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

టీఎస్‌ సివిల్ కానిస్టేబుల్‌ నియామకాలకు హైకోర్ట్‌ బ్రేక్‌.. ఆ తర్వాతే చేపట్టాలంటూ ఆదేశాలు..

Date : 10 October 2023 09:26 AM Views : 92

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలను గత బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ సమయంలో తెలంగాణ సివిల్‌ కానిస్టేబుల్‌ నియామకాలకు హైకోర్ట్‌ బ్రేక్‌ వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ కొత్త నియామకాలకు అడ్డంకి ఏర్పడింది. 4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటించాలంటూ ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడాన్ని కానిస్టేబుల్ నియామక బోర్డును హైకోర్టు తప్పుబట్టింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు.. మెయిన్స్‌ పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి.. తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలంటూ తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (TSLPRB)కి ఆదేశించింది. కాగా.. పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ గతేడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే ఏడాది ఆగస్టు 30న పరీక్షను నిర్వహించింది. సివిల్ కానిస్టేబుల్‌కు సంబంధించి 4,965 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలు రాశారు. అయితే, ఇందులో 3 ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో పాటు ఒక ప్రశ్న తప్పుగా ఇవ్వడంతో సమాధానాలు రాయలేకపోయామని పలువురు అభ్యర్థులు హైకోరట్లు దాఖలు చేసిన పిటిషన్లలలో పేర్కొన్నారు. ఇంటర్ వరకు చదువుకున్న అభ్యర్థులు.. ఇంగ్లీషులో ప్రశ్నలుండటంతో గందరగోళానికి గురై సమాధానం రాయలేక నష్టపోయారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే, అవి సరిగానే ఉన్నట్లు పోలీసు నియామక మండలి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఇంగ్లీషు పదాలను తెలుగులో అనువాదం చేసే అవకాశం ఉన్నా.. పరిగణలోకి తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. 4 ప్రశ్నలను తొలగించి ఆ తర్వాత మూల్యాంకనం చేయాలని.. దాని తర్వాత నియామక ప్రక్రియ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను నియామక మండలి టీఎస్ఎల్పీఆర్బీ గత బుధవారం విడుదల చేసింది. ప్రస్తుతం అభ్యర్థుల పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుతో నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :