Saturday, 14 September 2024 02:58:46 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

మూడో జాబితాతో కాంగ్రెస్‌లో ప్రకంపనలు.. టికెట్లు దక్కకపోవడంతో బరిలోకి నేతలు..!

Date : 07 November 2023 11:33 AM Views : 113

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. సెకండ్‌ లిస్ట్‌ విడుదల తర్వాత మొదలైన ఈ ఆగ్రహజ్వాలలు, మూడో జాబితా తర్వాత తారాస్థాయికి చేరాయి. అయా నియోజకవర్గాల్లో నిరసన సెగలు ఎగిసిపడ్డాయి. బోథ్‌, వనపర్తి, చెన్నూరు, పాలకుర్తి, డోర్నకల్, తుంగతుర్తి, సంగారెడ్డిలో ఆందోళనలు పీక్‌కి చేరాయి. డోర్నకల్ కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటింంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఆ ఒక్క స్థానం మాత్రమేలో అశావాహుల మధ్య పోటీతో బలనిరూణకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టిక్కెట్ రేసులో ఉన్న నేతలు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సుమారు ఐదు వేల మందితో బారీ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి భూపాల్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. డోర్నకల్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ కోసం భూపాల్ నాయక్, రామచంద్రనాయక్, నెహ్రూ నాయక్ ఈ ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు.. టిక్కెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. చివరికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రామచంద్రనాయక్‌ వేపే మొగ్గు చూపింది. దీంతో నిరుత్సాహనికి గురైన మిగిలిన ఆశావాహులు తగ్గేదీలే అన్నట్లు ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఏకంగా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ తన ప్రజాబలాన్ని పార్టీ అధిష్టానానికి చూపే ప్రయత్నాలు చేశారు.. అందులో భాగంగానే ఐదు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.. వివిధ కళారూపాలు, బతుకమ్మలు బోనాలతో భారీ ర్యాలీగా తరలివచ్చి మరిపెడలోని ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కురవి వీరభద్ర స్వామి దేవాలయం లో పూజలు నిర్వహించిన అనంతరం మరిపెడలో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన భూపాల్ నాయక్ ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటానన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :