Saturday, 18 May 2024 10:28:22 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కాంగ్రెస్ 2వ జాబితా మరింత జాప్యం.. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటే కారణమా..?

Date : 17 October 2023 12:45 PM Views : 89

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్, రెండవ జాబితా విషయంలో మరింత ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే రెండవ జాబితా ఉంటుందని పార్టీ పెద్దలు ప్రకటించినప్పటికీ, ఆ పరిస్థితి కనిపించడం లేదు. జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్’లో భాగంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సీపీఐ, సీపీఐ(ఎం)తో పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. ఈ ఇక రెండు పార్టీలతో పాటు కోదండరాంకు చెందిన తెలంగాణ జన సమితి(టీజేఎస్)ను కూడా కాంగ్రెస్ కూటమిలో చేర్చుకునేందుకు చర్చలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ కొలిక్కి వచ్చేందుకు మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రెండో జాబితాలో అభ్యర్థులను ఖరారు చేయాల్సిన స్థానాల్లో పార్టీని గెలిపించగలిగే బలమైన నేతల కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థిత్వం కోసం పార్టీలో దరఖాస్తు చేసుకున్న నేతల బదులు ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నేతలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే విడుదల చేసిన తొలి జాబితాలోని 55 మందిలో ఏకంగా 11 మంది నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చినవారే ఉన్నారు. ఈ నిర్ణయం పార్టీలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నప్పటికీ.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో గెలిచి తీరాలన్న పట్టుదలతో తెలంగాణ రాష్ట్ర నాయకత్వం, పార్టీ అధిష్టానం ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని త్యాగాలకు సైతం పార్టీ నేతలు సిద్ధం కాక తప్పదన్న సంకేతాలు ఇస్తోంది అధిష్టానం. బలమైన నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వర రావు, ఏనుగు రవీందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి వంటి నేతలతో రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు సాగిస్తోంది. మండవ వెంకటేశ్వర్లును పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయన్ను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. అలాగే ఏనుగు రవీందర్ రెడ్డిని బాన్సువాడ నుంచి పోటీ చేయించాలని చూస్తోంది. పాత వరంగల్ జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు రేవూరి ప్రకాశ్ రెడ్డిని బరిలోకి దించాలని భావిస్తోంది. మరోవైపు సీపీఐ, సీపీఐ(ఎం)తో పొత్తుల చర్చల్లో రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. అందులో సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం అంగీకారం తెలిపింది. అయితే సీపీఐ(ఎం)కు ఇచ్చే సీట్ల విషయంలోనే ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అలాగే టీజేఎస్ కోదండరాంకు ఎన్ని సీట్లు ఇవ్వాలన్న విషయంపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇవన్నీ కొలిక్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇక కొందరు నేతలు చెబుతున్న కథనాల ప్రకారం రెండోసారి పార్టీ సీఈసీ సమావేశం జరపాల్సిన అవసరం లేకుండానే, నిర్ణయాధికారాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌‌కు అప్పగించిందని చెబుతునర్నారు. వేణు గోపాల్‌తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్ రావు ఠాక్రే సమావేశమై రెండో జాబితాపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. కసరత్తు తుది రూపం వచ్చాక రెండో జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :