Saturday, 18 May 2024 10:51:41 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో రెండు కేసులు.. ఎందుకంటే?

Date : 07 November 2023 11:38 AM Views : 70

జై భీమ్ టీవీ - తెలంగాణ / : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరోసారి కేసు నమోదైంది .రెండు కేసుల్లో MLA రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నామినేషన్‌ రోజు విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ రాజాసింగ్‌పై కేసు నమోదు కాగా.. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా నిర్వాహకులను బెదిరించారని మంగళ్‌హాట్‌ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు చేశారు. ఇక దసరా ఆయుధపూజ రోజు నిషేధిత ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించినందుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన పోలీసులు వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలన్నారు తెలంగాణ పోలీసులు. వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి షాక్ తగిలింది. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రెండు కేసులు నమోదు చేశారు మంగళహాట్ పోలీసులు. నవరాత్రి ఉత్సవాల్లో రాజాసింగ్ విద్వేష పూరిత ప్రసంగం చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా ఈవెంట్ కు వచ్చే వారందరి గుర్తింపు కార్డులను తనిఖీ చేయాలన్నారు. ఈవెంట్ కోసం ముస్లిం బౌన్సర్లు డీజే ఆర్టిస్టులను రప్పిస్తే దాడులు చేస్తామని ఆ వీడియోలో పేర్కొన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ క్రమంలోనే స్థానిక నాయకుడు సమద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళాట్ పోలీసులు ఐపిసి 153ఏ,295 a, arms act, 504 సెక్షన్ల కింద ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. అంతకుముందు దసరా సందర్భంగా నిర్వహించే ఆయుధ పూజ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ వెపన్స్ తో పాటు తల్వార్లను ప్రదర్శించడంతో రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు మంగళహాట్ పోలీసులు. అందులో ప్రదర్శించిన తుపాకులు రాజాసింగ్ వ్యక్తిగత భద్రత సిబ్బందివని, వాటిని ప్రదర్శించడం నిషేధమన్నారు పోలీసులు. వెపన్స్‌తో పాటు కత్తులను ప్రదర్శించడం చట్ట విరుద్ధమని అంటున్నారు పోలీసులు. దీంతోనే ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేశామని చెప్తున్నారు. వారం రోజుల్లోగా నోటీసులకు స్పందించి రాజాసింగ్ వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు పోలీసులు. మరోవైపు ఈ రెండు కేసులపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్ తనను ఎన్నికల్లో నుండి అనర్హుడయ్యేలా చూడాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు నమోదు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధ పూజ సందర్భంగా ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు కూడా పూజలు చేస్తారని, వారందరిపై కూడా కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రభుత్వం కావాలనే తనను టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తుందని ఒక వీడియో విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న తనను పార్టీ కార్యకర్తల మద్దతు దూరం చేసేందుకు కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :