Wednesday, 15 January 2025 07:19:12 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

అకాల వర్షం అపార నష్టం.. తడిచిపోయిన ధాన్యం.. ఆందోళన చెందుతున్న అన్నదాతలు

Date : 25 November 2023 08:14 AM Views : 372

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులను అకాల వర్షం నిండా ముంచుతోంది. నిన్నటి దాకా సాగు నీటి కోసం తండ్లాడిన రైతులు.. ఎలాగోలా పంటలు పండించారు. అయితే ఇప్పుడు అకాల వర్షంతో రైతులకు అపార నష్టం కలగుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో అకాల వర్షం.. బీభత్సం సృష్టించింది. మండలంలోని పలు వడ్ల కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కిష్టంపేట గ్రామంలోని వడ్ల కొనుగోలు సెంటర్‌లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యం అరడానికి పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందని, ధాన్యం కాంట వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి.. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు. మహబూబాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భారీ వర్షం ధాటికి రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆందోళన పడుతున్నారు. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి సంస్థ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి సంస్థ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం వల్ల రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో తేడా ఉంటుందని తెలిపారు. Kalva Bugga Koneru: ఎండిపోతున్న వందల ఏళ్ల నాటి కోనేరు.. అరిష్టంగా భావిస్తున్న భక్తులు ఈనెల 27న తీవ్ర అల్పపీడనం ఏర్పడి రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు తమిళనాడును కూడా భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దీంతో ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కుండపోత వానలతో నీలగిరి జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. కొండ చరియలు, భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు ఎక్కడికక్కడ విరిగిపడడడంతో.. నీలగిరి కొండలపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో.. ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉండడంతో టీ ఎస్టేట్స్‌, అటవీ గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :