Saturday, 18 May 2024 10:36:22 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

హస్తం గూటికి రాజగోపాల్ రెడ్డి.. ఆయనతో పాటు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్

Date : 27 October 2023 10:47 AM Views : 64

జై భీమ్ టీవీ - తెలంగాణ / : భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం గూటికి చేరారు. గురువారం రాత్రి కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి. సంతోష్ కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గురువారం ఉదయమే ఢిల్లీ చేరుకున్న రాజగోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి మధ్యాహ్నం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. ఆయనతో సుమారు 40 నిమిషాల పాటు మంతనాలు సాగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై ఆ పార్టీ అధిష్టానం ఢిల్లీలో కసరత్తు చేస్తున్న సమయంలోనే ఈ ముగ్గురు నేతలు ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో సమావేశాలు నిర్వహించారు. అయితే తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి పోటీ చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నానంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పినట్టు సమాచారం. కేసీ వేణుగోపాల్‌తో పాటు మరికొందరు పార్టీ పెద్దలను ముగ్గురు నేతలు భేటీ అయ్యారు. గురువారం రాత్రి గం. 9.30 సమయంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం వారంతా మహారాష్ట్ర సదన్‌లో మాణిక్ రావ్ ఠాక్రేను కలిశారు. ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసుకున్నారు. శుక్రవారం ఉదయం గం. 9.30కు కాంగ్రెస్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉన్నందున.. టికెట్ ఆశిస్తున్న ఈ ముగ్గురు నేతలు ఆ సమయానికి పార్టీలో చేరి ఉంటేనే అభ్యర్థిత్వాలను పరిశీలించడం సాధ్యపడుతుందని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పింది. దీంతో శుక్రవారం రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలనుకున్న రాజగోపాల్ రెడ్డి తదితరులు గురువారం రాత్రే పార్టీ కండువగా కప్పుకోవాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం గం. 9.00కు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో రాజగోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అనంతరం ఖర్గే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం లోగా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగించి, టీ-కాంగ్రెస్ నాయకత్వం హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నట్టు తెలిసింది. అక్టోబర్ 28 నుంచి ప్రారంభించనున్న కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర నేపథ్యంలో నేతలు కసరత్తును శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకు సంబంధించిన వర్క్ అవుట్ కూడా పూర్తి చేసినట్టు తెలిసింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :