Saturday, 18 May 2024 10:51:50 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

వరంగల్ తూర్పు .. చరిత్ర తిరగ రాస్తారా..? మళ్లీ గెలుపు యోగం ఉందా..?

Date : 11 November 2023 03:49 PM Views : 72

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఆ నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయం ముఖచిత్రంలో ఆసక్తికర చర్చగా మారింది. ఎంతటి ఉద్దండులైనా సరే, ఒక్కసారికి మించి గెలిచిన చరిత్ర లేదు. ఏదో ఒక కారణంతో వారికి పదవి గండం తప్పడం లేదు. మరి ఈసారి పోటీ చేసే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ చరిత్ర తిరగ రాస్తారా..? మళ్లీ గెలుపు యోగం ఉందా..? అక్కడి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది..? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..! రాజకీయ చైతన్యానికి, ప్రజా పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ ఓరుగల్లు. ఎంతోమంది గొప్ప గొప్ప నేతలకు రాజకీయ జన్మనిచ్చిన గడ్డ ఈ అడ్డ. అలాంటి ఓరుగల్లు గడ్డపైన ఓ విచిత్ర తీర్పు ఆసక్తికరంగా మారింది. అదే వరంగల్ నియోజకవర్గం. వరంగల్ తూర్పు నియోజకవర్గంగా రూపాంతరం చెందిన తర్వాత ఎవరైనా ఒక్కసారికి మించి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన చరిత్ర లేదు. మంచి మంచి దిగ్గజాలకు కూడా ఇక్కడ రెండోసారి ఓటమి తప్పలేదు. వరంగల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2009లో అప్పటి మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఇక్కడి నుండి గెలుపొందారు. నియోజకవర్గం పునర్విభజనకు ముందు వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన ఆయన, 2014 ఎన్నికల్లో కొండా సురేఖ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బస్వరాజు సారయ్య కూడా BRS పార్టీలో చేరారు. ఊహించని పరిణామాలు నేపథ్యంలో 2018 ఎన్నికల్లో కొండా సురేఖకు టిక్కెట్ దక్కలేదు. దీంతో BRSను వీడి కాంగ్రెస్ లో చేరారు కొండా సురేఖ దంపతలు.. ఏకంగా ఈ నియోకవర్గాన్నే వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018 లో పరకాల నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2009 నుంచి ఇప్పటి వరకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినవారు లేరు. ఇక, 2018 ఎన్నికల్లో BRS అభ్యర్థి నన్నపునేని నరేందర్ ఇక్కడి నుండి గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నరేందర్ తిరిగి మళ్లీ అధికార BRS పార్టీ నుండి టిక్కెట్ సాధించి బరిలోకి దిగారు. ఆయనపై సొంత పార్టీలోనే ఇప్పుడు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడం ఓరుగల్లు హాట్ టాపిక్ గా మారింది. మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుందా..? అనే చర్చ జరిగుతుంది..! వరంగల్ తూర్పులో కొనసాగుతున్న చరిత్ర రిపీట్ అవుతుందా..? సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ ఆ చరిత్ర ను తిరగ రాస్తారా..? అనే చర్చ ఇప్పుడు ఓరుగల్లు వాసుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :