Saturday, 18 May 2024 09:22:36 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తా.. దివ్యాంగురాలికి రేవంత్ భరోసా..

Date : 18 October 2023 10:43 AM Views : 73

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఆరు గ్యారెంటీల హామీలతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది. ఈ తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి ఓ దివ్యాంగురాలికి హామీనిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తొలి ఉద్యోగం నీకే ఇస్తానంటూ హామీనిచ్చారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యంగురాలు రజినీ అనే దివ్యాంగురాలు మంగళవారం రేవంత్ రెడ్డిని కలిసి తనకు ఉద్యోగం ఇప్పించాలంటూ కోరింది. ఆమె మాటలను విన్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తానంటూ హామీ ఇచ్చారు. పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదని.. రజనీ గాంధీ భవన్ కు చేరుకుని రేవంత్ రెడ్డిని కలిసింది. ప్రభుత్వ ఉద్యోగం లేదని.. తన కు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని తన ఆవేదనను రేవంత్ కు చెప్పింది.. ఆమె బాధ విన్న తరువాత రేవంత్ రజనీకి భరోసా ఇచ్చారు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని.. సోనియా రాహుల్, మల్లికార్జున ఖర్గే వస్తారు.. అదే రోజు కాంగ్రెస్ పార్టీ నీకు ఉద్యోగం ఇస్తుందని హామీ ఇచ్చారు. ఇది నా గ్యారంటీ అని హామీ ఇచ్చిన రేవంత్.. స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో నింపి ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :