Saturday, 18 May 2024 12:36:44 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నేడు హస్తినకు సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ కార్యకలాపాలపై ఆరా

Date : 12 December 2022 09:37 AM Views : 213

జై భీమ్ టీవీ - తెలంగాణ / న్యూ ఢిల్లీ : తెలంగాణ రాజకీయాలు చకచకా సాగిపోతున్నాయి. ఓ వైపు లిక్కర్ స్కామ్ రాష్ట్రాన్ని కుదిపేస్తుండగా.. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఈ నెల 14 న ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ (సోమవారం) సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం సహా పలు కార్యక్రమాల కోసం సీఎం హస్తినకు పయనం కానున్నారు. సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో జాతీయ కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తోంది. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు దిల్లీకి వెళ్లి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం నేపథ్యంతో పూజలు, రాజశ్యామల యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించేదుకు సిద్ధమవుతున్నారు. సోమవారం రాత్రి దిల్లీకి చేరుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తారు. జాతీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. రాజకీయ నేతలు, సామాజిక, ఆర్థికవేత్తలతో పాటు పలువురు ప్రముఖులతో భేటీ అవుతారని సమాచారం. పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాల కోసం ఆయన 17వ తేదీ వరకు దిల్లీలోనే ఉండనున్నారు. కాగా.. తెలంగాణ ఉద్యమం నుండి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. ఇకపై జాతీయ పార్టీగా భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా ఆవిర్భవించింది. పార్టీ పేరును మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఈసీ లేఖ రాసింది. ఈ సందర్భంగా ఆ లేఖపై కేసీఆర్ సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీనటుడు, రాజకీయనాయకుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. గులాబీ జెండా మధ్యలో భారతదేశాన్ని చిత్రీకరించారు. పార్టీ జెండా రంగు, గుర్తు మాత్రం మారలేదు. 22 ఏళ్ల టీఆర్ఎస్ ను.. ఇకపై ప్రజల్లోకి బీఆర్ఎస్ గా తీసుకెళ్లే అంశంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున చట్ట సభల ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఢిల్లీలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం దేశంలోని పలు రాష్ర్టాల్లో కూడా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్‌ ఫర్‌ ఇండియా, దేశ్‌ క నేత.. కిసాన్‌ కీ భరోసా, అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదాలతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :