Saturday, 18 May 2024 01:59:56 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. ఒకవైపు నడ్డా.. మరోవైపు ప్రియాంక సభలు

Date : 19 November 2023 08:44 AM Views : 89

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రిఅమిత్‌షా, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ ఎన్నికల సభలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. మరికొందరు బీజేపీ, కాంగ్రెస్ నేతలు తెలంగాణ బాట పట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ ఎన్నిక ప్రచారంలో బీజేపీ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ తరపున ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అన్ని పార్టీల నుంచి స్టార్‌ క్యాంపెయినర్లు దూకుడుగా జనంలోకి వెళ్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలను ప్రకటించిన అన్ని పార్టీలు ఇక ప్రచారంలో దూకుడు పెంచుతున్నాయి. 32 అంశాలు 10 ముఖ్యమైన అంశాలతో కూడిన.. సకల జనుల సౌభాగ్య తెలంగాణ ‘మన మోదీ గ్యారెంటీ.. బీజేపీ భరోసా’ పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తరుఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ పాల్గొన్నారు. మేనిఫెస్టో రిలీజ్‌ అయిన తర్వాత ఫస్ట్ టైం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆదివారం బీజేపీ నిర్వహించే మూడు సభల్లో పాల్గొంటారు జేపీ నడ్డా. చేవెళ్ల, నారాయణపేట్‌ సభలకు హాజరవుతారు. అలాగే మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో నిర్వహించే రోడ్‌షో పాల్గొంటారు జేపీ నడ్డా. మేనిఫెస్టోను గడపగడపకు తీసుకెళ్లేలా పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేస్తారు నడ్డా. మరోవైపు కాంగ్రెస్ కూడా అంతే దూకుడుతో ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే 66 హామీలు, 6 గ్యారెంటీలతో కూడిన మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్. 66 హామీలతో కూడిన మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రిలీజ్‌ చేశారు. అంతకు ముందు కాంగ్రెస్ 6గ్యారెంటీలను సోనియా గాంధీ చేతుల మీదుగా రీలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో మీటింగ్స్ ఏర్పాటు చేశారు. అయితే మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్‌ టైం ప్రియాంక గాంధీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రియాంకతో ఎన్నిక ప్రచారం నిర్వహిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. దీంతో ఆదివారం తెలంగాణకు వస్తున్నారు ప్రియాంక గాంధీ. ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొంటారు ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, మేనిఫెస్టోపై ప్రచారం చేస్తారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ స్టార్ క్యాంపెనర్ల తోపాటు పార్టీ అగ్రనేతలతో బీజేపీ, కాంగ్రెస్ ప్రచారంలో జోరు పెంచుతున్నాయి. ఇక నవంబర్ 30న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాుల వెల్లడి కానున్నాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :