Friday, 04 October 2024 05:39:47 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

త్వరలో ఏపీలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పర్యటన.. భారీ బహిరంగ సభ

Date : 02 January 2023 01:20 PM Views : 256

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : టీఆర్ఎస్‌ బీఆర్ఎస్‌ అయ్యాక..విస్తరణ మొదలైంది..పక్కరాష్ట్రాల్లో కూడా కాలు పెడుతోంది.. ఏపీలో కూడా ఎంటరవుతోంది. అందులో భాగంగా రాజకీయ నాయకులతో పాటు, మాజీ బ్యూరోక్రాట్లను చేర్చుకోబోతున్నారు. మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ IRTS అధికారి రావెల కిశోర్‌బాబు, మాజీ IRS అధికారి పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన తుమ్మలశెట్టి జయప్రకాశ్‌ ప్రకాశ్‌లతో పాటు పలువురు సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అంతేకాదు త్వరలో ఏపీలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పర్యటించనున్నారు. పార్టీ బలోపేతం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. బీఆర్ఎస్ ఏపీ శాఖ కార్యాలయం త్వరలోనే ఏర్పాటు కానుంది. ఏపీలో బహిరంగ సభ ఏర్పాటుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది. విజయవాడ లేక గుంటూరులో సభ ఉండే అవకాశం ఉంది. విశాఖలోనూ కేసీఆర్‌ పర్యటించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఏపీ తర్వాత మిగిలిన రాష్ట్రాలపై కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టనున్నారు. తొలెతె తెలంగాణ ఆనుకుని ఉన్న బార్డర్ జిల్లాలే టార్గెట్‌గా గులాబీ దళపతి వ్యూహారు రచిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలోనూ BRSని విస్తరించనున్నారు కేసీఆర్. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నేతలతో.. రానున్న రోజుల్లో సమావేశం కానున్నారు. కర్ణాటక లో జెడిఎస్‌తో, మహారాష్ట్రలోని చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నాందేడ్ ప్రాంతం నుంచి తాము బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిశారు ఆ ప్రాంత నేతలు. జనవరి చివరి నాటికి మూడు రాష్ట్రాల్లో కమిటీలు వేయనుంది బిఆర్ఎస్ అధిష్టానం. జాతీయ పార్టీగా మారేందుకు BRS వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు అత్యంత వేగంగా పావులు కదుపుతున్నారు గులాబీ బాస్‌ కేసీఆర్‌. అందుకే కారును టాప్ గేర్‌ ముందుకు తీసుకెళ్లేందుకు జోరు పెంచారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :