Saturday, 18 May 2024 01:00:06 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నేడు రాష్ట్రానికి మరోసారి ప్రధాని.. మాదిగ విశ్వరూప సభకు హాజరుకానున్న మోదీ

Date : 11 November 2023 03:38 PM Views : 70

జై భీమ్ టీవీ - తెలంగాణ / : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల వేళ వారం రోజులు తిరక్కుండానే ప్రధాని మోదీ రెండోసారి హైదరాబాద్‌కు వస్తుండడంతో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బీసీ ఆత్మీయ సభలో పాల్గొన్నారు మోదీ. ఇవాళ మాత్రం మాదిగ విశ్వరూప సభకు హాజరవుతున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే మాదిగ, మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేరుగా పరేడ్ గ్రౌండ్‌కు వెళతారు. సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు పరేడ్ గ్రౌండ్ లో జరిగే సభలో పాల్గొంటారు. సభ అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలనే డిమాండ్‌తో ఏర్పడిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాదాపు మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. 2000 సంవత్సరంలో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లను వర్గీకరించినప్పటికీ 2004 లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసింది. అప్పటి నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్గీకరణపై పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలను డిమాండ్‌ చేస్తోంది. అన్ని పార్టీలు వర్గీకరణ చేస్తామని హామీలు ఇస్తున్నప్పటికీ పార్లమెంట్‌లో బిల్లు మాత్రం పెట్టడం లేదు. ఎస్సీలోని మాల కులస్తులు దీనికి అభ్యంతరం చెబుతుండడం, ఇది దేశంలోని అన్ని ఎస్సీ కులాలకు వర్తించే అవకాశముండడంతో అధికార పార్టీలు దీని జోలికి వెళ్లడం లేదు. ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి కేంద్రానికి పంపించారు. అయినా ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం బిల్లు పెట్టలేదు. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ… పదేళ్లుగా అధికారంలో ఉన్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. దీనిపై మాదిగ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీంతో ఎన్నికల సమయంలో అత్యధిక ఓట్లు కలిగిన మాదిగ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునే పనిలో పడింది బీజేపీ. ఇప్పటికే టికెట్ల కేటాయింపులో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత నిచ్చింది. తెలంగాణలో 19 రిజర్వ్‌డ్ స్థానాలతో పాటు అదనంగా రెండు జనరల్ స్థానాల్లోనూ ఎస్సీలకు అవకాశం కల్పించింది. అందులో మాదిగ సామాజిక వర్గానికి 14 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. మాల సామాజిక వర్గానికి ఏడు అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. మాదిగ విశ్వరూప సభలో ఎస్సీ వర్గీకరణపై ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :