Saturday, 18 May 2024 12:36:47 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Asaduddin Owaisi: ‘రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ మనిషి’.. ఘాటు వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్‌ ఓవైసీ

Date : 06 October 2023 07:43 PM Views : 76

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించేశారు ఓవైసీ బ్రదర్స్. నిన్న మొన్న వరకు అనేక రాజకీయ పార్టీలను విమర్శించిన ఎంఐఎం నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైనే విమర్శించడం మొదలుపెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముస్లింలకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ భాష మాట్లాడుతున్నాడు అంటూ ఓవేసి ఓ బహిరంగ సభలో ప్రస్తావించారు. భారతదేశంలో ఆర్ఎస్ఎస్.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించేశారు ఓవైసీ బ్రదర్స్. నిన్న మొన్న వరకు అనేక రాజకీయ పార్టీలను విమర్శించిన ఎంఐఎం నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైనే విమర్శించడం మొదలుపెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముస్లింలకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ భాష మాట్లాడుతున్నాడు అంటూ ఓవేసి ఓ బహిరంగ సభలో ప్రస్తావించారు. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ నేతలు కూడా ఇస్లాం ముస్లింలు భారతదేశంలో పుట్టిన వ్యక్తులు కాదు.. ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చి విస్తరించిన వాళ్ళనేసి చెప్తుంటారని అసద్ ప్రస్తావించారు ఈరోజు అదే ఆర్ఎస్ఎస్ ఆలోచనలు ఆర్ఎస్ఎస్ భాష రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు వాడుతున్నారనే కారణంగా ముస్లిం సమాజం కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 70 సంవత్సరాల నుంచి దేశంలో ఆర్ఎస్ఎస్ తో పోరాడుతున్నామని, గతంలో కిషన్ రెడ్డితో కలిసి బిజెపి కోసం పని చేసిన రేవంత్ రెడ్డి చరిత్ర మొత్తం మా దగ్గర ఉందని, ఆర్ఎస్ఎస్ ఆదేశాలతోనే బీజేపీ నుంచి, టీడీపీలో నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వ్యక్తులను ఎవరు నమ్మకూడదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక మతకలహాలకు అనేక నష్టాలకి కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించిందని ఓవైసీ సంచలాత్మక కామెంట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లారు. హైదరాబాద్ గోల్కొండ లో జరిగిన ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ పై మండిపడుతూనే కేసీఆర్‌ను మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలని, ప్రతి నియోజకవర్గంలో ఎంఐఎం విజయం సాధించేలా చేస్తామని ఓవైసీ చెప్పారు. నెహ్రూ సర్దార్ వల్లభాయ్ వల్లే ఈరోజు దేశంలో ముస్లింలు రాజకీయంగా ఎదగలేకపోయారని ఓ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అలాగే అక్బరుద్దీన్‌ ఓవైసీ కూడా రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. బీజేపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు పెద్దగా లేదని, అందులో భాగంగానే ఆరెస్సెస్‌ వ్యక్తిని తీసుకొచ్చి పీసీసీ చీఫ్‌ని చేశారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆరెస్సెస్‌తో పాటు.. వీహెచ్‌పీ కూడా రేవంత్‌ సీఎం కావడం కోసం పనిచేస్తున్నారని అన్నారు. తన మాటలు తప్పు అయితే రేవంత్‌ రెడ్డి భాగ్యలక్ష్మీ ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :