జై భీమ్ టీవీ - తెలంగాణ / : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర, దేశ ప్రజలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రలందరికీ లభించాలని ఇరువురు సీఎంలు ఆకాంక్షించారు. శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని కేసీఆర్ అభివర్ణించారు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏస్తుక్రీస్తు మార్గదర్శం చేశారని జగన్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన మెదక్ కెథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉదయం 4.30 గంటలకు మొదటి ఆరధన నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాస్టర్లు భక్తులకు దీవెనలు అందజేస్తారు.
Admin