Saturday, 18 May 2024 11:57:38 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల్లో నరాలు తెగే ఉత్కంఠ.. అసలేం జరిగిందంటే.?

Date : 17 October 2023 11:06 AM Views : 67

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఆ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. వారికి బీఫామ్స్‌ను కూడా అందజేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ ఆ ఒక్క నియోజకవర్గంపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటివరకు అసలు అభ్యర్థి ఎవరు అనేది ఇంకా సస్పెన్స్‌లోనే ఉందట. దీనితో అక్కడి బీఆర్ఎస్ నేతల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతూపోతోంది. ఇంతకీ అది ఏ నియోజకవర్గం ఏంటో తెలుసుకుందామా.. నర్సాపూర్, అక్టోబర్ 16: ఆ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. వారికి బీఫామ్స్‌ను కూడా అందజేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ ఆ ఒక్క నియోజకవర్గంపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదట. ఇప్పటివరకు అసలు అభ్యర్థి ఎవరు అనేది ఇంకా సస్పెన్స్‌లోనే ఉందట. దీనితో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతూపోతోంది. ఇంతకీ అది ఏ నియోజకవర్గం.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. వివరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు రోజురోజుకూ నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతుందట. ఓ వైపు జిల్లాలో ఉన్న అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి, బీఫామ్స్ ఇచ్చిన పార్టీ అధినేత కేసీఆర్.. ఒక్క నర్సాపూర్ నియోజకవర్గం విషయంలో ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదని తీవ్ర ఆందోళన చెందుతున్నారు స్థానిక నేతలు. మొన్నటి వరకు కొంత నార్మల్‌గానే ఉన్నప్పటికీ.. మిగతా వారికి బీ-ఫామ్స్ ఇవ్వడంతో తమ పరిస్థితి ఏంటి అని బాగా టెన్షన్ పడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ కోసం ఇద్దరు నేతలు ఆశిస్తున్నారు. అందులో ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాగా.. మరొకరు మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి. వీరిద్దరి మధ్య పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధిష్టానం ఈ నియోజకవర్గం టికెట్‌ను హోల్డ్‌లో పెట్టింది. టికెట్ విషయంలో ఎమ్మెల్యే వర్గం కొంత దూకుడుగా వ్యవహరించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ఇంకా పెండింగ్‌లో పెట్టారని పలువురు నేతల చెప్పుకుంటున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంతో పాటు జనగామ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అక్కడ లైన్ క్లియర్ అయ్యింది. కానీ నర్సాపూర్ నియోజకవర్గ టికెట్ విషయంలో పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఇక్కడి నేతలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే మదన్ రెడ్డిని, సునీత లక్ష్మారెడ్డిని ప్రగతి భవన్‌కి పిలిచి ఇద్దరితో చర్చలు కూడా జరిపారు సీఎం కేసీఆర్. దీంతో అందరూ పెండింగ్‌లో ఉన్న నర్సాపూర్ టికెట్ విషయంలో ఒక క్లారిటీ వస్తుందని భావించారు. కానీ ఇప్పటివరకు దానిపై ఊసే లేదు. మొదటి నుంచి సునీత లక్ష్మారెడ్డితో పాటు ఆమె అనుచరులు కూడా టికెట్ విషయంలో తొందరపడి ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. కానీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి వర్గం మాత్రం ఆయనకు మళ్లీ టికెట్ రావాలని నియోజకవర్గ వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేశారు. ఎప్పుడైతే ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చిందో అప్పటి నుంచి ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా టోటల్‌గా సైలెంట్ అయ్యారు. మరోవైపు నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్‌పై ఎవరికి వాళ్లు తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే పార్టీ అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతోందన్నది కూడా క్లారిటీ లేకపోవడంతో అసలు నర్సాపూర్ బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోందనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. అటు ఎమ్మెల్యే అనుచరులు, ఇటు సునీత లక్ష్మారెడ్డి అనుచరులు వారి వద్దకు వెళ్లి టికెట్ గురించి అడిగితే.. ఒకటి రెండు రోజుల్లో అయిపోతుంది అని గత నెల రోజులుగా చెబుతున్నారు. ఇక జిల్లా మొత్తం క్లియర్ చేసి ఈ ఒక్క నర్సాపూర్ టికెట్‌ను అధిష్టానం ఎందుకు ఆపిందో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు అక్కడి నేతలు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :