Saturday, 22 March 2025 05:21:51 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

కేసీఆర్‌ సెంటిమెంట్‌ వర్కౌవుట్‌ అవుతుందా? మంత్రి కేటీఆర్ చెప్పిన ఇంట్రస్టింగ్ లాజిక్..

Date : 15 October 2023 08:19 AM Views : 221

జై భీమ్ టీవీ - తెలంగాణ / : లక్కీ నంబర్‌.. సెంటిమెంట్‌.. ఎలక్షన్‌లో వర్కౌవుట్‌ అవుతుందా? సెంటిమెంట్లను కాస్త ఎక్కువగా ఫాలో అయ్యే సీఎం కేసీఆర్‌ అదృష్ట సంఖ్య 6 అట. లక్కీ నంబర్‌ను అనుసరించే కేసీఆర్‌ అన్నీ పనులు చేస్తారట. ఈ ఎన్నికల్లో కూడా కారు పార్టీకి ఆ లక్కీ నంబర్‌ కలిసొచ్చిదంట. మరీ కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతారా? మంత్రి కేటీఆర్‌ చెప్పిన లాజిక్‌ ఏంటి? ప్రత్యేక కథనం మీకోసం.. కేసీఆర్‌ చేసే ప్రతి పనిలో 6 నంబర్‌కు ప్రాధాన్యం.. గులాబీ బాస్‌..తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసే ప్రతి పనిలో 6 నంబర్‌కు ప్రాధాన్యం ఉండేటట్లుగా వ్యవహరిస్తారట. ప్రయాణించే వాహనం సహా, కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్‌ సమావేశం, ఇతర అన్నీ పనుల్లో ఆరు సంఖ్య ఉండేలా చూస్తారంట కేసీఆర్‌. ముఖ్యమంత్రి వ్యవహారాలను దగ్గరి నుంచి విశ్లేషించిన వ్యక్తులు చెప్తున్న మాటలు ఇవి. ఇక ఇవాళ అంటే 15వ తేదీన..ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫారాలు, ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభిస్తున్నారు. 1+5=6 అంటే ఆరు నంబర్‌ కలిసి వచ్చేలా సెంటిమెంట్‌గా ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్‌. దీన్నే ఆయన అభిమానులు కేసీఆర్‌ సిక్త్స్‌ సెన్స్‌ అని చెప్తున్నారు. ఇటీవల హనుమకొండజిల్లా పరకాల సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. మూడోసారి తమ ప్రభుత్వం వస్తుందని చెప్పేందుకు ఓ ఆసక్తికరమైన లాజిక్ చెప్పుకొచ్చారు. ఎలక్షన్‌ షెడ్యూల్‌ ప్రకారం పోలింగ్‌ నవంబర్‌ 30వ తేదీ కాగా, కౌటింగ్ డిసెంబర్ 3న జరగనుంది. ఈ రెండింటినీ కూడితే 3+3=6 వస్తుందని, ఇది కేసీఆర్‌ లక్కీ నంబర్‌ అన్నారు. కేసీఆర్‌ సెంటిమెంట్‌ ప్రకారం..తెలంగాణలో మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టటం ఖాయమంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి బీఆర్‌ఎస్‌ పార్టీకి లెక్క కుదిరింది.. 6 అచ్చొచ్చిన నంబర్‌..మూడోసారి సీఎం కూడా కేసీఆరే అని ఆ పార్టీ నేతలు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. మరి అన్నీ ఆయనకు అనుకూలంగా రావటం యాదృచ్ఛికమో, కాకతాలీయమో కానీ.. హ్యాట్రిక్ విజయం దక్కుతుందో లేదో చూడాలి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :