Saturday, 18 May 2024 12:36:43 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Telangana Crime: ప్రేమను నిరాకరించిందనీ.. మహిళపై కత్తితో దాడి చేసిన ఆటో డ్రైవర్!

Date : 05 October 2023 08:55 PM Views : 75

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తలరాత చెదిరి ఓ మహిళ భర్తతో విడిపోయింది. దీంతో పిలలతో సహా పుట్టింటికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఐతే అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆమెపై కన్నేశాడు. తనన ప్రేమించాలంటూ సదరు మహిళను నిత్యం వేధించసాగాడు. మహిళ అతని ప్రేమను నిరకారించడంతో దారుణానికి పాల్పడ్డాడు. అదును చూసి ఆమె ఇంట్లో దూరి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని.. Telangana Crime: ప్రేమను నిరాకరించిందనీ.. మహిళపై కత్తితో దాడి చేసిన ఆటో డ్రైవర్! కొత్తగూడెం, అక్టోబర్‌ 5: తలరాత చెదిరి ఓ మహిళ భర్తతో విడిపోయింది. దీంతో పిలలతో సహా పుట్టింటికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఐతే అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆమెపై కన్నేశాడు. తనన ప్రేమించాలంటూ సదరు మహిళను నిత్యం వేధించసాగాడు. మహిళ అతని ప్రేమను నిరకారించడంతో దారుణానికి పాల్పడ్డాడు. అదును చూసి ఆమె ఇంట్లో దూరి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసానికి గ్రామానికి చెందిన అనే వివాహిత భర్తతో విడిపోయి పుట్టింటి వద్ద ఉంటోంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోన్న నజియా స్థానిక పాఠశాలలో పిల్లలను చదివించుకుంటుంది. తన కుటుంబ పోషణకు పాల్వంచ పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తుంది. అదే గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తనను ప్రేమించాలని నిత్యం నజియాను వేధించసాగాడు. ఆమె అతని ప్రేమను నిరాకరించింది. దీంతో ధ్వేషం పెంచుకున్న శివ అదునుకోసం ఎదురుచూడసాగాడు. ఈ క్రమంలో రోజు లాగానే పిల్లలను స్కూలుకు పంపించి తాను షాపుకు వెళ్లేందుకు నిమగ్నమై ఉండగా ఆటో డ్రైవర్ శివ ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. తన ప్రేమను అంగీకరించాలని.. ఆమెతో గొడవ పడ్డాడు. ఆమె ఒప్పుకోక పోవడంతో తనతో తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. మహిళ కేకలు వేయడంతో తల్లి వచ్చి శివను అడ్డుకుంది. ఈ పెనుగులాటలో శివ పరారయ్యాడు. కత్తితో దాడి చేయగా నజియా చేతికి గాయాలయ్యాయి. బాధితురాలుపోలీసు స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసింది. ఆమెను చికిత్స కోసం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పాల్వంచ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఆటో డ్రైవర్ శివ పరారీలో ఉన్నాడు.. బాధిత మహిళను గత కొద్దిరోజులుగా ప్రేమించాలని, వేధిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలు కేకలు వేయగా తల్లి వచ్చి అడ్డుకోక పోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని, నిందితుడు నీ కఠినంగా శిక్షించాలని బాధితురాలు పోలీసులను కోరుతోంది

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :