Saturday, 18 May 2024 01:42:04 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కొండగల్‌లో రోడ్డెక్కిన కర్నాటక రైతులు.. ఎందుకో తెలుసా..

Date : 26 October 2023 10:15 AM Views : 75

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ దంగల్‌లో చిత్ర విచిత్రాలు తళుక్కుమంటున్నాయి. ఓవైపు టచ్‌చేస్తే కోట్లలో నోట్ల కట్టలు ..మరోవైపు హామీల హోరు.. విమర్శల జోరు.. ఎక్కడ చూడు ఎలక్షన్‌ మూడ్‌ కన్పిస్తోంది. మధ్య మధ్యలో కర్నాటకం కూడా రీసౌండ్‌ ఇస్తోంది. మహాభారత్‌ సీరియల్‌లోనే కాదు ఆ తరువాత ఎన్నో సినిమాల్లో బాణాల ఎఫెక్ట్స్‌చూశాం. ఇప్పుడు తెలంగాణ దంగల్‌ లోకి సరికొత్తగా కర్నాటక రైతు బాణం దూసుకొచ్చింది. మరి టార్గెట్‌ ఎవరు? ఓటేసిన చేతితో చెప్తున్నాం…అంటూ కొందరు సీన్లోకి వచ్చారు. వాళ్లెవరు? ఏమా కథ ఏంటో చదవండి.. కర్నాటకలో కరెంటు కోతలతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ కొడుతోంది. ఇప్పుడు టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ ఇలాకాలో కర్నాటక రైతులు ఆందోళన చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కర్నాటక రైతులు ఆందోళన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలను నమ్మొద్దంటూ… ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను నమ్మి ఓట్లేసి మోసపోయామని రైతులు చెప్పారు. ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేయాలని కర్నాటక రైతులు సూచించారు. తమ ప్రాంతంలో రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం నిర్వహించారని… అందుకే తాము ఇక్కడ ప్రచారం చేస్తున్నామన్నారు వాళ్లు. ఇక నిన్న గద్వాలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు కర్నాటక రైతులు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో నిరసనకు దిగారు. తమ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే కరెంటు ఇస్తోందని..దాంతో పంటలు ఎండిపోతున్నాయంటున్నారు. అదే పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో మరోసారి మోసం చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ పార్టీని నమ్మి మోసపోవద్దంటూ నినాదాలు చేశారు కర్నాటక రైతులు. ఇప్పుడు ఇదే బీఆర్‌ఎస్‌కు ఆయుధంగా మారింది. కర్నాటక రైతుల ఆందోళనతో…కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు బిఆర్ఎస్ కౌంటర్ అటాక్ షురూ చేసింది. కాంగ్రెస్ ఇచ్చే హామీల అమలుకు సాక్ష్యం కర్నాటక రైతుల ఆందోళన అంటూ గులాబీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెలంగాణలో కూడా పరిస్థితి ఇలాగే అవుతుందంటోంది బీఆర్‌ఎస్‌.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :