Saturday, 18 May 2024 10:36:21 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఫిఫా వరల్డ్ కప్ విజయంతో మైదానం బయట మెస్సీ మరో రికార్డు.. రొనాల్డో తరువాత మెస్సీనే..

ఫిఫా వరల్డ్ కప్ విజయంతో మైదానం బయట మెస్సీ మరో రికార్డు.. రొనాల్డో తరువాత మెస్సీనే..

Date : 20 December 2022 02:58 PM Views : 203

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో విజయం తర్వాత లియోనెల్ మెస్సీ మైదానం బయట మరో మైలురాయిని చేరుకున్నాడు. మెస్సీ తన ఆన్-ఫీల్డ్ ప్రత్యర్థి క్రిస్టియానో ​​రొనాల్డో తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో 400 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్న రెండవ వ్యక్తిగా నిలిచాడు. Messi Instagram: ఫిఫా వరల్డ్ కప్ విజయంతో మైదానం బయట మెస్సీ మరో రికార్డు.. రొనాల్డో తరువాత మెస్సీనే.. గ్రౌండ్‌లోకి దిగాడంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ. ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డోతో సమానంగా ఆటతీరును కనబర్చకలిగే మెస్సీకి అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే. ఇటీవల ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ జట్టుపై విజయం సాధించి కప్ గెలుచుకోవటంతో లియోనెల్ మెస్సీ పేరు మరింత ప్రాచుర్యం పొందింది. దీంతో మైదానంలో రికార్డులకు తోడు సోషల్ మీడియాలోనూ మెస్సి రికార్డు సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తుల్లో రెండో స్థానంకు మెస్సి దూసుకెళ్లాడు. Lionel Messi : లియోనల్ మెస్సీ వరల్డ్ గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగిన వెనుకున్న కారణాలు.. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో తన చిరస్మరణీయ విజయం తర్వాత మెస్సికి అభిమానుల ఫాలోయింగ్ సైతం భారీగా పెరిగింది. ఇన్ స్టాగ్రామ్ లో మెస్సి 401 మిలియన్ల మంది ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఫిఫా ప్రపంచ కప్‌కు ముందు మెస్సి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 376 మిలియన్లు ఉండేది. ప్రపంచ కప్ ప్రారంభమైన నాటి నుంచి నెల రోజుల్లోనే 25 మిలియన్ల మంది మెస్సి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ గా చేరిపోయారు. దీంతో ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక పాలోవర్స్ కలిగిన వారిలో రెండో స్థానంలో మెస్సి నిలిచాడు. మొదటి స్థానంలో ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు. ప్రస్తుతం రొనాల్డో 519 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో ఎవరూ అందుకోలేని స్థాయిలోకి దూసుకెళ్లాడు. 500 మిలియన్లు ఫాలోవర్స్ కు చేరుకున్న మొదటి వ్యక్తి రొనాల్డో. మెస్సి మరో 100 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సంపాదిస్తే ఆ స్థానంలో రెండో వ్యక్తిగా చేరిపోతాడు.

JAI BHEEM TV

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :