Saturday, 27 July 2024 01:55:44 PM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

సోమేశ్ ఏం ఐడియాలు ఇస్తడని అడ్వైజర్ గా పెట్టుకున్నవ్: RS ప్రవీణ్ కుమార్

Date : 10 May 2023 05:39 PM Views : 478

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : సీఎం సలహాదారుడిగా సోమేశ్ కుమార్ ను నియమించడంపై బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఇపుడున్న ఐఏఎస్ ల కంటే సోమేశ్ కుమార్ ఏం గొప్ప ఐడియాలు ఇస్తాడని చీఫ్ అడ్వైజర్ గా నియమించారో కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో లక్షలాది రైతుల నోట్లో మట్టిగొట్టి ధరణి పోర్టల్ ను తీసుకొచ్చిన సోమేశ్ కుమార్ ను ఎందుకు సలహాదారుడిగా పెట్టుకున్నారో చెప్పాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో అడ్వైజర్ గా రాజీవ్ శర్మ ఉన్నారని.. ఇంకెందర్ని అడ్వజర్ లుగా నియమిస్తారని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అడ్వైజర్లు, చీఫ్ అడ్వైజర్లతోనే పాలన సాగిస్తారా అనిప్రశ్నించారు. అడ్వైజర్లలో ఎంత మంది ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వంలో ఉన్న 13, 14 మంది అడ్వైజర్లు ఏం పనిచేస్తున్నారో వారికి ఏడిపార్ట్ మెంట్ అప్పగించారో ప్రజలకు చెప్పాలన్నారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు మే9 వ తేదిన సీఎం కేసీఆర్ కీలక పదవి కట్టబెట్టారు. తన ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్ శాంతి కుమారి పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సోమేష్ కుమార్ ప్రభుత్వ సలహాదారు పోస్టులో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. ప్రభుత్వ సర్వీసు నుంచి వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత సోమేష్ కుమార్ భవిష్యత్ కార్యచరణపై అనేక ప్రచారాలు సాగాయి. బీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం కూడా జరిగింది. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ ..తన ముఖ్యసలహాదారుగా నియమించుకోవడం విశేషం.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :