Saturday, 18 May 2024 10:51:45 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

దోచుకోవడానికి కొత్త అవతారమే బిఆర్ఎస్, ఎస్టీల రిజర్వేషన్లు అడ్డుకుంటున్న బిజెపి.

బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Date : 13 December 2022 07:57 PM Views : 209

జై భీమ్ టీవీ - తెలంగాణ / కరీంనగర్ జిల్లా : జై భీమ్ న్యూస్ : మానకొండూరు నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో బహుజన రాజ్యాధికార యాత్ర లో భాగంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేశాన్ని దోచుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ ఎత్తిన కొత్త అవతారమే బిఆర్ఎస్ ఎజెండా అని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రంలో దోచుకున్న డబ్బుతో మిగతా రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు కడుతున్నారని ఆయన విమర్శించారు.స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పెరకబండ గ్రామంలోని పేదల భూమిని ఆక్రమించి కోళ్ళ ఫారం పెట్టుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.ఎస్టీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించకుండా గిరిజనులను బిజెపి,టిఆర్ఎస్ ఏకమై మోసం చేస్తున్నాయని విమర్శించారు.అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు అమలు చేసిన ప్లభుత్వం,బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీల రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు.బిసిల కులగణన చేయకుండా బిజెపి తెలంగాణలో అడుగు పెట్టొద్దని హెచ్చరించారు.బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 142వ రోజు మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో పర్యటించారు.మండలంలోని అనంతగిరి రిజర్వాయర్ పేరుతో భూములు గుంజుకొని పేదలను రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు.ముంపుగ్రామాల్లోని భూములన్ని వ్యవసాయానికి పనికి రాకుండా పోయాయన్నారు.నిర్వాసితుకు భూమి,దళితబంధు వంటి పథకాల ఆశచూపి మోసం చేశారన్నారు.పేదలను దోచుకున్న వంద కోట్లు ఢిల్లీలో పెట్టుబడులు పెడుతున్న దొంగలకు ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు.డబుల్ బెడ్ రూం పథకం ఇవ్వకుండా,ఇపుడు మళ్లీ మూడు లక్షలు ఇస్తామని చెబుతున్నారని,ప్రతి నెలా జీతాలకే బడ్జెట్ లేనపుడు మూడు లక్షలు ఎలా ఇస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.బహుజన రాజ్యంలో రాష్ట్రంలోని సంపదనంతా సమానంగా జనాభా దామాషా ప్రకారం పెంచుతామని స్పష్టం చేశారు.నిరుపేదలందరికీ ఎకరం భూమి పంచిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రాంచంద్రం,రాష్ట్ర కార్యదర్శి విశ్వం,రాష్ట్ర మహిళా నాయకురాలు శిరీష,జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్,మహిళా కన్వీనర్ సుమలత,నియోజకవర్గ అధ్యక్షులు ప్రభాకర్,లింగయ్య,యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :