Saturday, 18 May 2024 11:37:57 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

పది రోజుల్లోనే 200 కోట్లు దాటిన సొమ్ము.. 2018 ఎన్నికల్లో ఎంత డబ్బు పట్టుబడిందో తెలుసా

Date : 20 October 2023 08:44 AM Views : 77

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతోనే.. అన్ని చోట్ల విసృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భారీ సొమ్మును పోలీసు అధికారులు సీజ్ చేస్తున్నారు. 2018లో ఓవరాల్ ఎన్నికల్లో 137కోట్ల విలువగల సొమ్ము స్వాధీనం చేసుకోంగా.. ఈసారి కోడ్ అమల్లోకి వచ్చిన 10రోజుల్లోనే 243కోట్లకుపైగా డబ్బు, మద్యం, నగలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది ECI. సెంట్రల్ ECI టీమ్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, డీజీపీ, CS తో జరిగిన సమావేశంలో మద్యం, డబ్బు పై సుధీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్రంలోని ఐఏఎస్, IPS ల బదిలీలు.. సీజింగ్ అంశంపై కీలక పాత్ర పోషినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250వరకు చెక్ పోస్టులను ఏర్పాటు చేసారు అధికారులు. ఇందులో అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు 89, సరిహద్దు చెక్ 169 ఏర్పాటు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే, టార్గెట్ మనీ పేరుతో లెక్కకు మించి చేతికి దొరికిన ప్రతిదానిని సీజ్ చేస్తున్నారు పోలీసులు. నగదు, బంగారం, మద్యం, ఉచిత వస్తువులు, తదితర సామాగ్రిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ సీజ్ చేసి ఎన్నికల సంఘానికి రోజువారీగా లెక్కలు పంపుతోంది పోలీస్ శాఖ. అదే విధంగా 2018జనరల్ ఎన్నికల అంచనాలకు మించి 2023లో భారీ సంఖ్యను చూపిస్తోంది ఈసీ. గతంలో ఎప్పుడూ లేవి విధంగా సీజింగ్‌ను టార్గెట్ పెట్టుకోని మరి తనిఖీలు చేస్తున్నారు. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇవ్వాల్టి (అక్టోబర్ 19) వరకు అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం సొమ్ము 243కోట్లు దాటింది. ఇందులో నగదు మొత్తం 87కోట్ల 92లక్షలు, 10కోట్ల 21లక్షలు విలువ చేసే మద్యం.. దాదాపు 65వేల లీటర్లు సీజ్ చేసారు అధికారులు. 182కిలోల బంగారం, 693కిలోల వెండి, 154 క్యారెట్ల వజ్రాలు మొత్తం వీటి విలువ 120కోట్ల 40లక్షలుగా ఈసీ లెక్కల్లో తెలిపింది. ఇవి కాకుండా ఉచితాల విలువ 17కోట్ల 48లక్షలు ఇందులో బియ్యం, చీరెలు, ల్యాప్ టాప్స్, క్రీడా సామాగ్రి, వాహనాలు ఉన్నట్లు తెలిపారు. గడిచిన 24గంటల్లో అన్ని రకాలు కలిపి 78కోట్ల విలువ సోత్తును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 2018 ఎన్నికల్లో.. 2018 జనరల్ ఎన్నికల ఓవరాల్ గా 137 కోట్ల విలువ గల సొమ్ము సీజ్ చేస్తే ఇందులో నగదు -97 కోట్లు, మద్యం -2.3 కోట్లు (76000 లీటర్లు), మత్తు పదార్తాలు/గంజాయి -0.42 కోట్లు (1674 కేజీలు గాంజాయ్) బంగారం, వెండి తదితర విలువైన వస్తువులు -3.2 కోట్లు (13.16 కేజీల బంగారం, 40.7 కేజీల వెండి), ఉచితాలు -0.05 కోట్లు, ఇతర స్వాధీనాలు – 34 కోట్లు మాత్రమే.. కానీ ఇప్పుడు అంటే 2023జనరల్ ఎన్నికల సందర్బంగా కేవలం 10రోజుల్లోనే 240కోట్లు దాటడం చర్చనీయాంశంగా మారింది. ఈ సారి తెలంగాణ జనరల్ ఎన్నికలను ECI సీరియస్ గా తీసుకుంది. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికల నిర్వహణ జరుపుతోంది. ఇక అన్ని రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం కట్టడి చేయాలనీ ఫిర్యాదులు చేయడంతో మనీ టార్గెట్ గా తనిఖీలు చేస్తోంది. ఇక ఇప్పుడే ఇలా ఉంటే నామినేషన్ ప్రక్రియ, పోలింగ్ సమయానికి నగదు, డబ్బు స్వాధీనం ఎలా ఉంటుందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :