Saturday, 27 July 2024 01:11:58 PM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ప్రపంచం తెలంగాణ వైపు చూస్తుంది.

దేశానికి,ప్రపంచానికి ఆహార ధాన్యాలు అందిస్తున్నది తెలంగాణ.మంత్రి కమలాకర్

Date : 05 November 2022 12:02 PM Views : 447

జై భీమ్ టీవీ - తెలంగాణ / కరీంనగర్ జిల్లా : ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ స్థాయిలో పంట లేదు, సేకరణ లేదు.రైతు పండించిన ప్రతీ గింజ కొనే ఏకైక రాఫ్ట్రం తెలంగాణ,రాష్ట్రవ్యాప్తంగా 1545 కొనుగోలు కేంద్రాలు ప్రారంభంభిస్తున్నారు.పంట వచ్చే తీరుగా కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్లకు ఆదేశం జారీ చేశారు.నూకలు తినమని,పంటనుకొనమని, ర్యాకులు, స్టోరేజి ఇవ్వక కేంద్రం ఇబ్బందిపెట్టినా ప్రతీ గింజ కొంటాం,రాజకీయ నాయకులు కల్లాల దగ్గరకు వెళ్లి రాజకీయం చేయవద్దు మిల్లుల్లో గింజ కూడా కోతపెట్టకూడదు.నవంబర్ మద్య నుండి డిసెంబర్ మద్యలో ఊపందుకోనున్న కొనుగోల్లు,నిధులు, గన్నీలు, ప్యాడీక్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు, టార్పాలిన్లు సర్వం సిద్దం చేశారు.రైతులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమం,పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.దేశానికి,ప్రపంచానికి ఆహార ధాన్యాలు అందిస్తున్న తెలంగాణ రాష్ట్రం వైపు ప్రపంచం చూస్తుందని రాష్ట్ర బీసీ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.నగునూర్,చామనపల్లి,చర్లబుత్కూర్,దూర్శేడ్ గ్రామాల్లో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వానాకాలం కోటీ యాబై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో యాబై లక్షలు ఇతర అవసరాలకు తీసుకోగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామన్నారు.2014కు ముందు కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే నేడు కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం గర్వకారణమన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ పంట సరిగా పండాలంటే అవసరమైన నీళ్లు,పెట్టుబడి,కరెంటు,ఎరువులు సకాలంలో అందించారని,గతంలో మార్కెటింగ్ చేసుకోవడంలోనూ రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, కేంద్రం నూకలు తినాలని,మేం కొనమని ఖరాఖండిగా చెప్పినా రైతు పండించిన ప్రతీ గింజను కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తుందన్నారు.గతంలో శ్రీలంక లాంటి దేశాలు ఎదుర్కొన్న ఆహార సంక్షోభం చూసామని,కనీసం దాన్ని పట్టించుకోకుండా ముందు చూపు లేకుండా రైతుల పంటలపై చిన్నచూపుతో వ్యవహరించిన తీరుతో కేవలం ఆరు నెలల్లోనే కేంద్రం వద్ద నిల్వలు కొరత ఏర్పాడ్డాయని అన్నారు.బాబాసాహెబ్ చెప్పిన ఆహార భద్రతను గాలికొదిలి పూర్తి వ్యాపారిలా వ్యవహరించే కేంద్రం ఉండడం దురదృష్టమన్నారు,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో భూమి మేయలేని విదంగా పంటను పండించామని,కానీ దీన్ని అడ్డుకునే విదంగా ర్యాకు మూమెంట్ ఇవ్వకా, గోడోన్లు కేటాయించక,ఎఫ్.సి.ఐ వంటి సంస్థలను కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవడం దారుణమన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 6713 కొనుగోలు కేంద్రాల ప్రతిపాదించామని,ఇప్పటివరకూ 1545 కేంద్రాలు ప్రారంభించి దాదాపు 50వేల మెట్రిక్ టన్నుల్ని 6313 మంది రైతుల నుండి 100 కోట్ల రూపాయల విలువగల ధాన్యం ప్రభుత్వం సేకరించందని అన్నారు.సాదారణ రకం 2040,మేలురకం 2060 మద్దతు ధరతో ధాన్యం సేకరిస్తామన్నారు,నిధుల కొరత లేదని, గన్నీలు, ప్యాడీక్లీనర్లు,టార్పాలిన్లు,మాయిశ్చర్ మిషన్లతో పాటు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు.25 వేల కోట్ల గన్ని బ్యాగులు అవసరం కాగా 12 కోట్లు గన్ని బ్యాట్ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని ఈ నెల ఆఖరిలోగా 25 కోట్ల గన్ని బ్యాగులు సిద్ధంగా ఉంచడం జరుగుతుందన్నారు.గతంలో కళ్లాలు ఉండి ఎప్.ఏక్యూ వచ్చేదని ఇప్పుడు నేరుగా కొనుగోలు కేంద్రాలకు తెస్తుండడంతో అక్కడ ప్యాడీక్లీనర్ల ద్వారా ఎఫ్.ఏ.క్యూ పాటించి ఒక్క గింజను సైతం తరుగు పెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి గంగుల,కానీ కొన్ని చోట్ల రైతులే స్వయంగా రెండు మూడు కిలోలు తరుగు పెట్టినా సరె ఎట్లుందో అట్ల తీసుకోవాలంటున్నారని తద్వారా మిల్లుల్లో తరుగుతీస్తున్నారని ఈ సారి అలాంటి వాటికి అనుమతించేదన్నారు.గతంలోని 14 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం తోనే రైస్ మిల్లులున్నాయని,2300 మిల్లుల్లో నిరంతరాయంగా మిల్లింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు.ప్రతీ ఏఈవో పరిధిలోని 5వేల ఎకరాల వారిగా పీపీసీ కొనుగోలు సెంటర్లలోని ట్యాబ్ లకు అనుసందానం చేసాం,ఖచ్చితంగా ఆ ప్రాంతం పంటను ఎలాంటి షరతులు లేకుండా సేకరిస్తున్నాం,పక్క రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో మద్దతు దరతో కొనడం లేనందున ఆ ధాన్యం తెలంగాణకు వచ్చే అవకాశం లేకుండా పకడ్బందిగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నియంత్రిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్, లారీ ట్రాన్స్ పోర్ట్ దారులు,రైస్ మిల్లర్లు పూర్తిగా సహకరించాలని,స్టోరేజీ లేని చోట ఇంటర్మీడియట్ స్టోరేజీ ఏర్పాటు చేసామన్నారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు గతంలోనే ఆదేశించామని,కోతలు రానిచోటకి రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం వెల్లి రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు మంత్రి గంగుల,గత ఎనిమిదేళ్లుగా మీరు రాజకీయం చేస్తున్నా మేం కొంటున్నామని మిమ్మల్ని పట్టించుకోకుండా రైతు సంతోషంగా ఉన్నాడన్నారు.ఈ సారి సైతం సేకరణకు కావాల్సిన ప్రతీది సమకూర్చుకున్నామన్నారు.కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 4.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేసామని 350 కొనుగోలు కేంద్రాలకు గానూ 97 కొనుగోలు కేంద్రాలను పంట వచ్చే ఏరియాల్లో ఏర్పాటు చేసామన్నారు,ఇప్పటివరకూ జిల్లాలో 7వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని,నవంబర్ చివరి నుండి డిసెంబర్ మద్యలో కొనుగోళ్లు జోరందుకుంటాయన్నారు.ఎంత వచ్చినా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్ వి కర్ణన్, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్,జడ్పిటిసి పురమల్ల లలిత శ్రీనివాస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రెడ్డి వేణి మధు, ప్యాక్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాశెట్టి శ్రీనివాస్,గ్రంథాలయ చైర్మన్ పోన్నం అనిల్ గౌడ్,ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య,జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్,జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేష్,జిల్లా సహకార అధికారి శ్రీ మాల,స్థానిక ప్రజాప్రతినిధులు,రైతులు తదితరులు పాల్గొన్నారు

Praveen

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :